Saare Jahan Se Achha: 'సారే జహాన్ సే అచ్ఛా'రాసిన కవి గూర్చి సిలబస్ నుంచి తొలగింపు
ఈ మేరకు అకడమిక్ కౌన్సిల్ మే 26న తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించిందని చట్టసభ్యులు ధృవీకరించారు. భారత్ విభజనకు ముందు ఉన్న సియోల్‌కోట్‌లో 1877లో జన్మించిన పాక్ కవి అల్లామా ఇక్బాల్‌గా పిలిచే ముమహ్మద్ ఇక్బాల్ ఈ ప్రముఖ గేయం 'సార్ జహాన్ సే అచ్ఛా'ని రాశారు. ఆయన గురించి ఉన్న పాఠ్యాన్ని బీఏలోని పొలిటికల్ సిలబస్ నుంచి తొలగించారు.
దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏపీవీపీ) స్వాగతించింది. పొలిటికల్ సైన్స్ సిలబస్‌లో మార్పుకు సంబంధించి తీర్మానం తీసుకురావడమే గాక ఆ పార్యాంశాన్ని తొలగించినట్లు కౌన్సిల్ సభ్యుడు తెలిపారు. వాస్తవానకి 'మోడరన్ ఇండియన్ పొలిటికల్ థాట్' అనే సబ్జెక్టు బీఏలోని ఆరవ సెమిస్టర్ పేపర్‌లో బాగం. దీన్ని ఇప్పుడూ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కి సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాజకీయా ఆలోచనలోని గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ కోర్సును రూపొందించింది యూనివర్సిటీ.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (07-13 మే 2023)
ఈ కోర్సులో భాగంగా సిలబస్‌లో రామ్మోహన్ రాయ్, పండిత రమాబాయి, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ మరియు భీమ్‌రావ్ అంబేద్కర్ తదితరులు గురించి ఉంది. అంతేగాదు ఆధునిక భారతీయ ఆలోచనలపై విమర్శనాత్మక అవగాహనతో విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ఈ కోర్సును ఏర్పాటు చేశారు. ఆయా ప్రముఖుల ఆలోచనల నేపథ్య అన్వేషణ తోపాటు చారిత్రక పథంలో ముఖ్యమైన విషయాలపై సమయోచిత చర్చలను గుర్తించడం సంబంధిత వారి రచనలలో ప్రదర్శించబడిన విభిన్న అవకాశాలను విద్యార్థులకు తెలుసుకోవాలనే లక్ష్యంతో పాఠ్యాంశాల్లో భాగం చేశారు.
సిలబస్‌లో మొత్తం ఆయా ప్రముఖుల గూర్తి మొత్తం 12 యూనిట్లు ఉంటాయి. ఇదిలా ఉండగా, భారత రాజకీయ ఆలోచనలను గూర్చి తెలసుకోవాలన్న ఉద్దేశ్యంతో బీఏ ఆరవ సెమిస్టర్‌లో ఒక సబ్జెక్టు చేర్చిన దీనిలో ఆ మతోన్మాద పండితుడు మొహమ్మద్ ఇక్బాల్‌ని గూర్చి పాఠ్యాంశాన్ని సిలబస్ నుంచి తొలగించింది అకడమిక్ కౌన్సిల్. నిజానికి ఇక్బాల్‌ని పాకిస్తాన్ తాత్విక తండ్రిగా పిలుస్తారు. అతను ముస్లిం లీగ్‌లో జిన్నాను నాయకుడిగా స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడని, ఇక్బాల్ కూడా జిన్నా వలే భారతదేశ విభజనకు కారణమని యూనివర్సిటీ ఆరోపించింది.
New Parliament: పార్లమెంటు 2.0.. సర్వాంగ సుందరంగా కొత్త భవనం.. ప్రస్తుత పార్లమెంటు చరిత్ర చూస్తే..