Skip to main content

Russian Crude Oil: రష్యా నుంచే అత్యధిక ముడిచమురు

Most of the crude oil comes from Russia

దేశంలోకి ముడిచమురు దిగుమతి గత నెలలో అత్యధికంగా రష్యా నుంచే జరిగింది. రోజుకు 16 లక్షల బ్యారెళ్ల చొప్పున ముడి చమురు రష్యా నుంచి వచ్చింది. ఇరాక్‌ (రోజుకు 9.39 లక్షల బ్యారెళ్లు), సౌదీ అరేబియా(రోజుకు 6.47లక్షల బ్యారెళ్ల) దేశా­ల నుంచి దిగుమతి అయిన ముడిచమురు కంటే కూడా ఇదే ఎక్కువ కావడం గమనార్హం. గతేడాది ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించే ముందు.. మన ముడిచమురు దిగుమతుల్లో రష్యా వాటా 1శాతం లోపే కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇది 35 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో యూఏఈ నుంచి రో­జుకు 4.04 లక్షల బ్యారెళ్లు, అమెరికా నుంచి 2.48 లక్షల బ్యారెళ్ల ముడిచమురు దిగుమతి అయ్యింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Mar 2023 05:02PM

Photo Stories