మార్చి 2019 జాతీయం
Sakshi Education
జేకేఎల్‌ఎఫ్‌పై కేంద్రప్రభుత్వం నిషేధం
జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్‌ఎఫ్)పై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఈ చర్య తీసుకుంటున్నట్లు మార్చి 22న ప్రకటించింది. యాసిన్‌మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్‌ఎఫ్ జమ్మూకశ్మీర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదం, వేర్పాటు వాదానికి మద్దతివ్వడంతోపాటు ఉగ్ర సంస్థలతో సంబంధాలు నెరుపుతున్నట్లు తెలిపింది. అలాగే 1989లో కశ్మీరీ పండిట్లను స్వస్థలాల నుంచి వెళ్లగొట్టడానికి, వారి దారుణ హత్యలకు జేకేఎల్‌ఎఫ్ కారణమని ప్రభుత్వం అభిప్రాయపడింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్‌ఎఫ్)పై నిషేధం
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : కేంద్రప్రభుత్వం
ఎందుకు : ఉగ్రవాదం, వేర్పాటు వాదానికి మద్దతిస్తుందని
ఇంధన సూచీలో భారత్‌కు 76వ ర్యాంక్
అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో భారత్‌కు 76వ ర్యాంకు లభించింది. 115 దేశాలతో రూపొందించిన ఈ జాబితాను ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) మార్చి 25న విడుదల చేసింది. ఈ జాబితాలో స్వీడన్ మరోసారి అగ్రస్థానంలో నిలవగా స్విట్జర్లాండ్, నార్వే వరుసగా రెండు, మూడు స్థానాలు పొందాయి. చైనా 82వ స్థానం దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 100 కోట్ల మంది విద్యుత్ వినియోగానికి దూరంగా ఉన్నట్టు ఈ సందర్భంగా డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. అధిక జనాభాతోపాటు ఇంధన వ్యవస్థలో కార్బన్ డై ఆక్సైడ్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని పేర్కొంది.
సూచీని ఇందన భద్రత, పర్యావరణ స్థిరత్వం, ఇంధన అందుబాటు వంటి అంశాలను వంటి పరిగణలోనికి తీసుకోని డబ్ల్యూఈఎఫ్ ఈ సూచీని రూపొందిస్తుంది. 2018లో విడుదల చేసిన అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో భారత్ 78వ స్థానం పొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌కు 76వ ర్యాంక్
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)
ఎక్కడ : అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచీలో
వాయుసేనలోకి చినూక్ ప్రవేశం
అమెరికాలో తయారైన నాలుగు చినూక్ సీహెచ్ 47ఎఫ్(ఐ) హెవీలిఫ్ట్ హెలికాప్టర్లను భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టారు. చండీగఢ్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో మార్చి 25న వీటిని వాయుసేనకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎయిర్‌చీఫ్ మార్షల్ బి.ఎస్.ధనోవా మాట్లాడుతూ... చినూక్ హెలికాప్టర్ల రాకతో వాయుసేన ఎయిర్‌లిఫ్ట్ సామర్థ్యం పెరిగిపోతుందని పేర్కొన్నారు.
2015లో 15 చినూక్ హెలికాప్టర్లను కొనుగోలుకు అమెరికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా తొలి విడతలో నాలుగు హెలికాప్టర్లను అమెరికా అందజేసింది. అమెరికాలో ఫిలడెల్ఫియాలోని బోయింగ్ కర్మాగారంలో వీటిని తయారుచేశారు. రెండు రొటేటర్లతో విభిన్నంగా కనిపించే చినూక్ హెలికాప్టర్లు దాదాపు 10 టన్నులకు పైగా పేలోడ్‌ను తీసుకెళ్లగలవు. సైనిక దళాలను వేగంగా పర్వతాలతో కూడిన సరిహద్దులకు చేర్చడానికి దోహదం చేస్తాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన హెలికాప్టర్లలో ఒకటిగా చినూక్ హెలికాప్టర్లు పేరొందాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత నాలుగు చినూక్ హెలికాప్టర్ల ప్రవేశం
ఎప్పుడు : మార్చి 25
ఎవరు : అమెరికాకి చెందిన బోయింగ్ సంస్థ
ఎక్కడ : ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, చండీగఢ్
30 వేల ప్రపంచ మ్యాప్‌లు ధ్వంసం
చైనాలోని క్వింగ్‌డావో పట్టణంలో ఒక సంస్థ తయారుచేసిన 30 వేల ప్రపంచ మ్యాప్‌లను మార్చి 26న చైనా ధ్వంసం చేసింది. తమ దేశ భూభాగానికి వ్యతిరేకంగా ఈ మ్యాప్‌లను తయారు చేసినందుకే వీటిని ధ్వంసం చేసినట్లు చైనా వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్‌ను భారత భూభాగంగా, తైవాన్‌ను ప్రత్యేక దేశంగా ఈ మ్యాప్‌లలో చూపించారని పేర్కొంది.
భారత ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా దక్షిణ టిబెట్‌లో భాగంగా చెప్పుకుంటుంది. అయితే భారత్ ఈ వాదనను ఖండిస్తోంది. భారత భూభాగంలో అరుణాచల్ ప్రదేశ్ భాగమనీ, అక్కడకు భారతీయులెవరైనా ఎలాంటి అభ్యంతరాలూ లేకుండా వెళ్లొచ్చని స్పష్టం చేస్తోంది. ద్వీప దేశం తైవాన్ కూడా తమదేనని చైనా అంటోంది. ఈ వాదనను తైవాన్ తిప్పికొడూతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 30 వేల ప్రపంచ మ్యాప్‌లు ధ్వంసం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : చైనా
ఎక్కడ : క్వింగ్‌డావో, చైనా
ఎందుకు : తమ దేశ భూభాగానికి వ్యతిరేకంగా ఈ మ్యాప్‌లను తయారు చేశారని
దేశరక్షణ అంశాలకు ఎన్నికల కోడ్ వర్తించదు : ఈసీ
దేశ రక్షణకు సంబంధించిన అంశాలు, ప్రకటనలపై ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 27న వెల్లడించింది. మిషన్ శక్తి’ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఈసీ ఈ మేరకు స్పష్టం చేసింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల ప్రకటనలకు ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేదని ఈసీ పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశరక్షణ అంశాలకు ఎన్నికల కోడ్ వర్తించదు
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : కేంద్ర ఎన్నికల సంఘం
సీఆర్‌పీఎఫ్ 80వ వ్యవస్థాపక దినోత్సవంలో దోవల్
సీఆర్‌పీఎఫ్ 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో జాతీయ భద్రత సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ పాల్గొన్నారు. హరియాణలోని గుర్గావ్‌లో మార్చి 19న జరిగిన ఈ వేడుకల్లో దోవల్ మాట్లాడుతూ... దేశ నాయకత్వం ఎలాంటి విధ్వంసకర ఉగ్రదాడినైనా ఎదుర్కొని అత్యంత సమర్థంగా పోరాడగలదని జాతీయ భద్రతా సలహాదారు ధీమా వ్యక్తం చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించడాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన సాహస అవార్డులను కూడా ఆయన అందజేశారు.
1939లో బ్రిటిష్ పాలనలో ‘క్రౌన్ రిప్రజెంటేటివ్‌స పోలీస్’ పేరుతో ఏర్పాటైన ఈ విభాగం పేరును దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో సీఆర్‌పీఎఫ్‌గా మార్చారు. ప్రస్తుతం 246 బెటాలియన్లు, 3 లక్షల మంది జవాన్లతో దేశ వ్యాప్తంగా వివిధ రకాలైన కీలక విధులను నిర్వహిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఆర్‌పీఎఫ్ 80వ వ్యవస్థాపక దినోత్సవం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : జాతీయ భద్రత సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్
ఎక్కడ : గుర్గావ్, హరియాణ
గోవా సీఎంగా ప్రమోద్ ప్రమాణ స్వీకారం
గోవా 13వ ముఖ్యమంత్రిగా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. గోవా రాజధాని పణజీలో మార్చి 19న ప్రమోద్ చేత గవర్నర్ మృదులా సిన్హా కొత్త ప్రమాణం చేయించారు. అనంతరం 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వం మార్చి 20న అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతుండటం తెలిసిందే. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పరీకర్ మార్చి 17న కన్నుమూశారు.
1973, ఏప్రిల్ 24న గోవాలో జన్మించిన ప్రమోద్ సావంత్ మహారాష్ట్రలోని కోల్హాపూర్ ఆయుర్వేద వైద్య విద్యనభ్యసించి కొంతకాలం వైద్యుడిగా పనిచేశారు. ఆరెస్సెస్‌లో పనిచేసిన ఆయన బీజేపీలో యువజన నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఉత్తర గోవాలోని సంఖాలిమ్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పరీకర్‌కు విశ్వాసపాత్రుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
గోవా అసెంబ్లీలో పార్టీల బలాబలాలు
బ్రెగ్జిట్ ఒప్పందాన్ని తోసిపుచ్చిన బ్రిటన్ పార్లమెంట్
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెనుదిరిగే బ్రెగ్జిట్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పందం లేకుండానే నిష్క్రమించాలని ప్రధాని థెరిసా మే చేసిన తాజా ప్రతిపాదన దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ లో గట్టెక్కలేకపోయింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వం 43 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. 321 మంది సభ్యులు అనుకూలంగా, 278 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో బ్రెగ్జిట్ ప్రక్రియకు సంబంధించి మే ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనలు రెండుసార్లు వీగిపోయినట్లయింది. షెడ్యూల్ ప్రకారమైతే మార్చి 29న యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికి రావాల్సి ఉంది. కానీ తాజా పరిణామం నేపథ్యంలో ఆ తేదీన ఒప్పందం లేకుండా నిష్క్రమించడం సాధ్యం కాదని ప్రభుత్వం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బ్రెగ్జిట్ ప్రక్రియ పర్యవేక్షణను పార్లమెంట్‌కు అప్పగించాలని విపక్ష లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కోర్బిన్ డిమాండ్ చేశారు. సభ్యుల మధ్య రాజీకి ప్రయత్నిస్తానని చెప్పారు.
రెండో రెఫరెండానికి తిరస్కరణ :
బ్రెగ్జిట్ కోసం రెండో రెఫరెండం నిర్వహించాలన్న ప్రతిపాదనను బ్రిటన్ పార్లమెంట్ మార్చి 14వ తేదీన భారీ మెజారిటీతో తిరస్కరించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా 334 మంది, అనుకూలంగా 85 మంది ఓటేశారు. విపక్ష లేబర్ పార్టీ సభ్యులు చాలా మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఒకవేళ ఈ సవరణ దిగువ సభ హౌజ్ ఆఫ్ కామన్స్ లో గట్టెక్కినా, ప్రభుత్వం దానిని తప్పకుండా అమలుచేయాల్సిన అవసరం లేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : {బెగ్జిట్ ఒప్పందాన్ని తోసిపుచ్చిన బ్రిటన్ పార్లమెంట్
ఎప్పుడు : మార్చి 14
ఎవరు : బ్రిటన్ ప్రధాని థెరిసా మే
ఎక్కడ : బ్రిటన్
ఎందుకు : ఒప్పందం ప్రకారం మార్చి 29న యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటికి రావాలనే
పీహెచ్‌డీ వర్క్ వీసాలపై పరిమితి ఎత్తివేత
ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతిభావంతులను ఆకర్షించే దిశగా బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. పీహెచ్‌డీ స్థాయి వర్క్ వీసాలపై ఇప్పటివరకూ ఉన్న పరిమితిని ఎత్తివేస్తామని ప్రకటించింది. తాజా నిర్ణయంతో బ్రిటన్‌లో పనిచేయడంతో పాటు స్థిరపడాలనుకునే భారతీయ నిపుణులకు గణనీయమైన లబ్ధిచేకూరనుంది. ఈ విషయమై బ్రిటన్ ఛాన్స్ లర్ ఫిలిప్ హమ్మండ్ మాట్లాడారు. పీహెచ్‌డీ వర్క్ వీసాలను టైర్-2(సాధారణ) కేటగిరి నుంచి మినహాయిస్తాం. అలాగే పరిశోధకులు ఏడాదికాలంలో 180 రోజులకు మించి బ్రిటన్‌ను విడిచిపెట్టరాదన్న ఇమిగ్రేషన్ నిబంధనలను కూడా సవరిస్తాం’ అని అన్నారు. బ్రిటన్ జారీచేసే టైర్-2 వీసాను పొందేవారిలో భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. గతేడాది జారీచేసిన మొత్తం టైర్-2 వీసాల్లో 54 శాతం వీసాలను భారతీయులే దక్కించుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్రిటన్‌లో పీహెచ్‌డీ వర్క్ వీసాలపై పరిమితి ఎత్తివేత
ఎప్పుడు : మార్చి 14
ఎక్కడ : బిట్రన్
ఎందుకు : ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతిభావంతులను బ్రిటన్ ఆకర్షించేందుకు.
భారీ ప్రాజెక్టులకూ పునరుత్పాదక ఇంధన హోదా
దేశంలో జల విద్యుదుత్పత్తిని మరింత పెంచేలా... భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులకు పునరుత్పాదక ఇంధన హోదా ఇవ్వడంతోపాటు, పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మార్చి 7న జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన రూ.31,500 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల్లో రెండు థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్లు సహా జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మించతలపెట్టిన హైడ్రో ప్రాజెక్టు కూడా ఉంది.
మరికొన్ని కేబినెట్ కమిటీ నిర్ణయాలు...
ఏమిటి : భారీ ప్రాజెక్టులకూ పునరుత్పాదక ఇంధన హోదా
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
బెంగాల్-ఒడిశా మధ్య మూడోలైన్‌కు ఆమోదం
పశ్చిమబెంగాల్‌లోని నారాయణ్‌గఢ్-ఒడిశాలోని భద్రక్ మధ్య రెల్వే శాఖ మూడో లైన్‌ను నిర్మించేందుకు కేంద్ర మంత్రి మండలి మార్చి 7న ఆమోదం తెలిపింది. ఈ మార్గంలో రద్దీ తీవ్రంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 155 కి.మీ మేర కొత్త ట్రాక్ వేయనున్నారు. ఈ మార్గం నిర్మాణానికి రూ.1,866.31 కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేయగా, 2024 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు వల్ల 37.2 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.
కేంద్ర మంత్రి మండలి మరికొన్ని నిర్ణయాలు
ఏమిటి : బెంగాల్-ఒడిశా మధ్య మూడోలైన్‌కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : కేంద్ర మంత్రి మండలి
అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వం
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దశాబ్దాలుగా నలుగుతున్న రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. రాజకీయంగా సున్నితమైన ఈ కేసులో మధ్యవర్తిత్వం వహించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కోర్టు నియమించింది. ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌తోపాటు సీనియర్ న్యాయవాది, మధ్యవర్తిగా మంచి పేరు గడించిన శ్రీరామ్ పంచు ఈ త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉంటారు. మరో వారంలో మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించి 8 వారాల్లో ముగించాలని రాజ్యాంగ ధర్మాసనం మార్చి 8న ఆదేశించింది.
అయోధ్యలో వివాదంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని నిర్మోహి అఖాడా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డ్‌లకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : సుప్రీంకోర్టు
ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 8న శంకుస్థాపన చేశారు. అలాగే లక్నో ఉత్తర-దక్షిణ కారిడార్ మెట్రో సేవలను ప్రారంభించిన ఆయన వారణాసిలోని కాశీవిశ్వనాథ్ ఆలయం అప్రోచ్ రోడ్డు-సుందరీకరణ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. మరోవైపు లక్నోలో ఇటీవల కశ్మీరీ వ్యాపారులపై కొందరు దుండగులు దాడిచేసిన నేపథ్యంలో ప్రధాని స్పందించారు. దేశవ్యాప్తంగా కశ్మీరీలపై దాడులు చేస్తున్న అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఆగ్రా, ఉత్తరప్రదేశ్
రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు శంకుస్థాపన
ఉత్తరప్రదేశ్‌లోని కుర్జాలో, బిహార్‌లోని బుక్సారిన్‌లో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 9న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 50ఏళ్ల పాత సామగ్రిని వాడటంతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.10కు చేరుకుందని తెలిపారు. కానీ సౌరశక్తి ద్వారా ఇప్పుడు యూనిట్ విద్యుత్‌ను రూ.2కే ఉత్పత్తి చేయొచ్చన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు శంకుస్థాపన
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఉత్తరప్రదేశ్‌లోని కుర్జా, బిహార్‌లోని బుక్సారిన్
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10న విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ఏప్రిల్ 11న తొలి దశ ఎన్నికలు, రెండో దశ ఏప్రిల్ 18, మూడో దశ ఏప్రిల్ 23, నాలుగో దశ ఏప్రిల్ 29, ఐదో దశ మే 6న, ఆరో దశ మే 12, ఏడో దశ మే19న నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకటనతో తక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : కేంద్ర ఎన్నికల సంఘం
బోయింగ్ 737పై భారత్ నిషేధం
బోయింగ్ 737 మ్యాక్స్-8 విమానాలపై భారత ప్రభుత్వం మార్చి 12న నిషేధం విధించింది. విమానాలు సురక్షితమేనని నిర్థారించేందుకు అవసరమైన మార్పులు, భద్రతా చర్యలు చేపట్టేవరకు నిషేధం కొనసాగుతుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ తెలిపింది. అంతేకాకుండా, ఈ విమాన పెలైట్లకు వెయి్య గంటలు, కో పెలైట్‌కు 500 గంటలు నడిపిన అనుభవం ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఇథియోపియా ఎయిర్‌లైన్స్ ప్రమాదం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు బోయింగ్ 737పై ఇప్పటికే నిషేధం విధించాయి. ఇథియోపియా విమాన ప్రమాదంలో ఆరుగురు భారతీయులు సహా 157 మంది ప్రయాణికులు మృత్యువాతపడిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బోయింగ్ 737పై నిషేధం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : భారత్
ప్రభుత్వ సైట్లలో ప్రధాని ఫొటోల తొలగింపు
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ప్రధాని కార్యాలయం సహా వివిధ కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రుల చిత్రాలను తొలగించారు. 2019, ఏప్రిల్ 11 నుంచి లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమవుతాయని ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసీ ప్రకటన నుంచే ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు కోడ్ అమల్లో ఉంటుంది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మంత్రులు, అధికారిక వర్గాలు పథకాలు, వాటికి నిధుల కేటాయింపులు జరపకూడదు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అధికార పార్టీ కానీ, మంత్రులు కానీ ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టకూడదు. అలాగే ప్రచారానికి అధికారులను ఉపయోగించుకోకూడదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ సైట్లలో ప్రధాని ఫొటోల తొలగింపు
ఎప్పుడు : మార్చి 12
ఎందుకు : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన కారణంగా
భారత పైలట్ వర్ధమాన్ విడుదల
పాకిస్తాన్ అరెస్ట్ చేసిన భారత వాయుసేన(ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌ను మార్చి 1న విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 28న ప్రకటించారు. పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల స్థావరంపై భారత్ ఫిబ్రవరి 26న వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ సందర్భంగా పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత్ నేలకూల్చగా, ఇండియాకు చెందిన రెండు ఫైటర్ జెట్లను కూల్చేశామనీ, వర్ధమాన్ అభినందన్ అనే పైలట్‌ను అరెస్ట్ చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. వర్ధమాన్ అరెస్టును ధ్రువీకరించిన భారత విదేశాంగ శాఖ.. జెనీవా నిబంధనల ప్రకారం అభినందన్ విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాలనీ, ఆయన్ను సురక్షితంగా విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత పైలట్ వర్ధమాన్ విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : పాకిస్తాన్
పని విద్య సదస్సు ముగింపులో ఉప రాష్ట్రపతి
హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నయ్ తాలిమ్ (పని విద్య)పై రెండ్రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఫిబ్రవరి 28న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు ఉన్నత విద్యా సంస్థలు ఇతోధిక కృషి చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. మహత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ (ఎంజీఎన్‌సీఆర్‌ఈ) ఆధ్వర్యంలో ఈ సదస్సుని నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తాలిమ్ (పని విద్య) సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, హైదరాబాద్
స్వదేశం చేరుకున్న అభినందన్
శత్రు దేశ యుద్ధ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి వెళ్లి పాకిస్తాన్‌కు చిక్కిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్ సురక్షితంగా స్వదేశం చేరుకున్నారు. పాకిస్తాన్ అధికారులు అభినందన్‌ను మార్చి 1న అట్టారీ-వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించారు. వైమానిక దళ అధికారులు, వేలాది మంది ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పాకిస్తాన్ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో ఫిబ్రవరి 27న పీఓకేలో మిగ్-21 విమానం కూలిపోయి అభినందన్ పాకిస్తాన్ బలగాలకు దొరికిపోయారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వదేశం చేరుకున్న భారత వైమానిక దళ పైలట్
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : అభినందన్ వర్థమాన్
ఎక్కడ : అట్టారీ-వాఘా సరిహద్దు
మార్చి 8 నుంచి పోషణ్ అభియాన్ వార్షికోత్సవం
జాతీయ పోషకాహార మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మార్చి 8 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా ‘పోషణ్ అభియాన్’ మొదటి వార్షికోత్సవాన్ని నిర్విహ స్తామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ మార్చి 1న వెల్లడించారు. మూడు రాష్ట్రాల్లో దాదాపు 21 వేల మంది తక్కువ బరువుతో పుట్టిన శిశువులను గుర్తించామని మంత్రి తెలిపారు. వీరంతా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో 2017 అక్టోబర్ నుంచి 2018 అక్టోబర్ మధ్య పుట్టిన వారని చెప్పారు. వారిలో 15 వేల మంది శిశువులను సాధారణ స్థితికి తీసుకొచ్చామని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘పోషణ్ అభియాన్’ మొదటి వార్షికోత్సవం
ఎప్పుడు : మార్చి 8 నుంచి 22 వరకు
ఎవరు : కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : జాతీయ పోషకాహార మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో
సంరతా ఎక్స్‌ప్రెస్ సేవలు పునఃప్రారంభం
భారత్-పాక్ మధ్య నడిచే సంరతా ఎక్స్‌ప్రెస్ సేవలు మార్చి 3 నుంచి పునఃప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య పరస్పర అంగీకారంతో ఈ సేవలను పునరుద్ధరించినట్లు మార్చి 2న భారత రైల్వే తెలిపింది. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేసిన మరుసటి రోజే పాక్ సంరతా ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
పాకిస్తాన్‌పై భారత వైమానిక దళం జరిపిన మెరుపుదాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే ఏకై క రైలు సంరతా ఎక్స్‌ప్రెస్‌ను పాక్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ కూడా గత నెల 28న సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంరతా ఎక్స్‌ప్రెస్ సేవలు పునఃప్రారంభం
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : భారత రైల్వే శాఖ
కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా ఎక్స్‌పో ప్రారంభం
దేశ రాజధాని ఢిల్లీలో కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా ఎక్స్‌పో-2019ను ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 2న ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని సాంకేతిక నిర్మాణ సంవత్సరంగా ప్రకటించారు. గృహనిర్మాణ రంగంలో పెరుగుతున్న అవసరాలను అందు కునేందుకు వీలుగా టెక్నాలజీని విసృ్తతంగా వాడాలని సూచించారు. 2022 నాటికల్లా భార తీయులందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రైవేటు రంగం కూడా సహకరించాలని పిలుపునిచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా ఎక్స్‌పో-2019 ప్రారంభం
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ
రైఫిళ్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఏకే-203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 3న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ... భారత్-రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో తయారయ్యే ఏకే-203 రైఫిళ్లపై ‘మేడ్ ఇన్ అమేథీ’ అని ఉంటుందని చెప్పారు. భారత రక్షణ బలగాల అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏకే-203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : అమేథీ, ఉత్తరప్రదేశ్
ఆధార్ వినియోగ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం
ఆధార్ నంబర్‌ను గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా మొబైల్ సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతాలకు స్వచ్చందంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ మార్చి 3న ఆమోదం తెలిపారు. మొబైల్ సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ వినియోగాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆర్డినెన్స్ తో ఇకపై వీటికి ఆధార్‌ను వినియోగించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినప్పటికీ, రాజ్యసభ ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధార్ వినియోగ ఆర్డినెన్స్ కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
బాంద్రా-జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో బాంద్రా-జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 4న ప్రారంభించారు. అహ్మదాబాద్ మెట్రో మొదటి దశ(6.5కిలోమీటర్లు)ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఉగ్రవాదులు పాతాళంలో దాక్కున్నా వదలిపెట్టబోమని చెప్పారు. బాలాకోట్‌పై ఐఏఎఫ్ దాడి పైలట్‌ప్రాజెక్టు మాత్రమే.. అసలైన దాడులు ఇకపై మొదలవుతాయని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాంద్రా-జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జామ్‌నగర్, గుజరాత్
పాఠ్యాంశంగా అభినందన్ ధైర్యసాహసాలు
భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ధైర్యసాహసాలను స్కూలు విద్యార్థులకు పాఠ్యాంశంగ చేర్చాలని రాజస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యా మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా మార్చి 5న తెలిపారు. పాకిస్తాన్ సైనికులకు చిక్కి, ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా అభినందన్ ప్రదర్శించిన పోరాటపటిమ ప్రశంసనీయమని, అది భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గాథలను కూడా పాఠ్యాంశాలుగా చేర్చాలని ఇటీవలే రాజస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసి, శత్రుదేశానికి పట్టుబడి కూడా సాహసోపేతంగా వ్యవహరించిన అభినందన్ స్వదేశానికి సురక్షితంగా తిరిగివచ్చిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాఠ్యాంశంగా అభినందన్ ధైర్యసాహసాలు
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : రాజస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : రాజస్తాన్
ఆర్మీ శాఖల్లో మహిళా అధికారులు
ఆర్మీలోని మొత్తం పది శాఖల్లో మహిళలు శాశ్వత కమిషన్(పీసీ)లో పనిచేయడానికి వీలు కల్పిస్తూ కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ మార్చి 5న నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్వల్పకాలిక సేవల కమిషన్(ఎస్‌ఎస్‌సీ)ను ఎంపిక చేసుకున్నవారు కూడా పీసీకి దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా రక్షణశాఖ పేర్కొంది. వైమానిక దళం ఇప్పటికే మహిళలను తమ విభాగంలోని అన్ని శాఖల్లో అనుమతిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్మీ శాఖల్లో మహిళలు మహిళలు శాశ్వత కమిషన్(పీసీ)లో పనిచేయవచ్చు
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ
ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన ప్రారంభం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్(పీఎం-ఎస్‌వైఎమ్) యోజన’ను ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 5న ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... మాన్‌ధన్ యోజనను దేశంలోని 42 కోట్ల మంది కూలీలకు అంకితం చేస్తున్నానని అన్నారు. 2019, ఫిబ్రవరి 15 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండి, నెలకు రూ.15,000 కంటే తక్కువగా సంపాదిస్తున్న అసంఘటిత కార్మికులు ఈ పథక ప్రయోజనాలను పొందవచ్చు.
పీఎం-ఎస్‌వైఎమ్ చేరిన వారు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతినెల రూ.3,000 పెన్షన్‌ను అందుకోవచ్చు. ఇందులో చేరిన వారు 18 ఏళ్ల వయసు ఉన్న వారు నెలకు రూ.55 , 29 ఏళ్ల దాటిన వారు నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
జాతీయ పెన్షను పథకం, ఈఎస్‌ఐలో ఉన్న సభ్యులు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారికి ఈ పథకంలో చేరే అవకాశం లేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన ప్రారంభం
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : అహ్మదాబాద్, గుజ రాత్
ఐటీబీపీ 53వ బెటాలియన్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కలికిరి సమీపంలో ఏర్పాటైన ఐటీబీపీ (ఇండో టిబెటెన్ బార్డర్ పోలీస్) 53వ బెటాలియన్ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మార్చి 6న న్యూఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూ.1,095 కోట్లతో నిర్మించిన బీఎస్‌ఎఫ్, సీఎఫ్‌ఎస్‌ఎల్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఢిల్లీ పోలీస్, ఐటీబీపీ, ఎల్‌పీఏఐ, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బి కేంద్రాలను కూడా ఆయన ప్రారంభించారు. దేశ రక్షణలో పారామిలటరీ బలగాల సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీబీపీ 53వ బెటాలియన్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఎక్కడ : కలికిరి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా ఇండోర్
దేశంలోనే అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్‌లోనిఇండోర్ వరుసగా మూడోసారి నిలిచింది. ఈ మేరకు ఢిల్లీలో మార్చి 6న కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్-2019 అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ అవార్డుల జాబితాలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అంబికాపుర్ రెండోస్థానం, కర్ణాటకకు చెందిన మైసూర్ మూడో స్థానం పొందాయి.
అవార్డుల వివరాలు
స్వచ్ఛ సర్వేక్షణ్-2019 అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు ఏడు అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లూరుపేట, కావలి అవార్డుల జాబితాలో నిలవగా.. తెలంగాణ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్ పీర్జాదిగూడ ఈ ఘనతను నిలబెట్టుకున్నాయి. స్వచ్ఛ నగరాల జాబితా కోసం జనవరి 4 నుంచి 31 వరకు కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. మొత్తం 4,237 పట్టణాలు, నగరాల్లో ఈ సర్వే చేపట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే అత్యుత్తమ పరిశుభ్ర నగరం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : ఇండోర్, మధ్యప్రదేశ్

ప్రస్తుత సభ్యులు | 36 (మొత్తం 40) |
బీజేపీ | 12 |
గోవా ఫార్వర్డ్ పార్టీ | 3 |
మహారాష్ట్ర గోమంతక్ పార్టీ | 3 |
కాంగ్రెస్ | 14 |
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | 1 |
స్వతంత్రులు | 3 |
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోవా 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : ప్రమోద్ సావంత్
ఎక్కడ : పణజీ, గోవా
విశ్వాస పరీక్షలో గోవా ముఖ్యమంత్రి విజయం
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మార్చి 20న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 15 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. గోవా అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 40 మంది కాగా.. ప్రస్తుతం అసెంబ్లీలో 36 మంది ఉన్నారు. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతుండటం తెలిసిందే. ఇప్పటివరకు గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పరీకర్ మార్చి 17న కన్నుమూశారు. దీంతో కొత్త ముఖ్యమంత్రిగా సావంత్ మార్చి 19న ప్రమాణ స్వీకారం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశ్వాస పరీక్షలో గోవా ముఖ్యమంత్రి విజయం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ప్రమోద్ సావంత్
హ్యాపినెస్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 140వ స్థానం
ప్రపంచ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి 156 దేశాలకు సంబంధించి మార్చి 20న విడుదల చేసిన ‘హ్యాపినెస్ రిపోర్ట్-2019’లో భారత్‌కు 140వ స్థానం లభించింది. ఈ జాబితాలో ఫిన్లాండ్ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలవగా తరువాతి స్థానాల్లో వరుసగా డెన్మార్క్, నార్వే, ఐస్‌లాండ్, నెదర్లాండ్‌స ఉన్నాయి. అలాగే అమెరికాకు 19వ స్థానం, పాకిస్తాన్ 67వ స్థానం, బంగ్లాదేశ్ 125వ స్థానం , చైనా 93వ స్థానాలు పొందాయి. యుద్ధ ప్రభావిత దక్షిణ సూడాన్ ఈ సూచీలో అట్టడుగున నిలిచింది. 2018లో భారత్ 133వ స్థానం పొందగా ప్రస్తుతం ఏడు స్థానాలు దిగజారింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హ్యాపినెస్ ర్యాంకింగ్‌లో భారత్‌కు 140వ స్థానం
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ఐక్యరాజ్య సమితి
సంరతా కేసులో తీర్పు వెలువరించిన కోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2007 నాటి సంరతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ల కేసులో హరియాణాలోని పంచకులలో ఉన్న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మార్చి 20న తీర్పు వెలువరించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న స్వామి అసిమానంద్, లోకేశ్ శర్మ, కమల్ చౌహాన్, రాజిందర్ చౌదరిలను నిర్దోషులుగా ప్రకటించింది. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలను సమర్పించలేకపోయిందని ఎన్‌ఐఏ ప్రత్యేక జడ్జి జగ్‌దీప్ సింగ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ కేసులో పాకిస్తాన్‌కు చెందిన ప్రత్యక్ష సాక్షులను విచారించాలని రహీలా వకీల్ అనే పాక్ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
అసలేం జరిగింది?
ఢిల్లీ నుంచి లాహోర్‌కు వెళుతున్న సంరతా ఎక్స్‌ప్రెస్‌లో 2007, ఫిబ్రవరి 18న రాత్రి 11.53 గంటలకు హరియాణాలోని పానిపట్ నగరానికి సమీపంలో ఉన్న దివానా రైల్వే స్టేషన్‌ను దాటగానే శక్తిమంతమైన బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 68 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్ పౌరులే ఉన్నారు. అక్షర్‌ధామ్(గుజరాత్), సంకట్‌మోచన్ మందిర్(వారణాసి), రఘునాథ్ మందిర్(జమ్మూ) సహా దేశవ్యాప్తంగా ఆలయాలపై దాడులకు ప్రతీకారంగానే నిందితులు సంరతా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్లు జరిపారని ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంరతా కేసులో తీర్పు వెలువరించిన కోర్టు
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు
ఎక్కడ : పంచకుల, హరియాణ

- రుణ సమస్యల్లో చిక్కుకున్న ల్యాంకో గ్రూపునకు చెందిన 500 మెగావాట్ల తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును (సిక్కిం) ప్రభుత్వరంగ ఎన్‌హెచ్‌పీసీ కొనుగోలుకు అనుమతి.
- 25 మెగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ ప్రాజెక్టులకు కూడా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు హోదా ఇవ్వడం.
- బిహార్‌లోని బుక్సర్‌లో ఒక్కోటి 660 మెగావాట్ల రెండు యూనిట్లను రూ.10,439 కోట్లతో ప్రభుత్వరంగ ఎస్‌జేవీఎన్ అనుబంధ కంపెనీ ఎస్‌జేవీఎన్ థర్మల్ ప్రైవేటు లిమిటెడ్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం.
- ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 660 మెగావాట్ల రెండు సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను రూ.11,089 కోట్ల వ్యయ అంచనాలతో ఏర్పాటుకు ఆమోదం.
- కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయంపై నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకు గాను ప్రత్యామ్నాయ యంత్రాంగానికి అధికారాలను కట్టబెడుతూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఈ ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) 2017లో ఏర్పాటైంది.
ఏమిటి : భారీ ప్రాజెక్టులకూ పునరుత్పాదక ఇంధన హోదా
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
బెంగాల్-ఒడిశా మధ్య మూడోలైన్‌కు ఆమోదం
పశ్చిమబెంగాల్‌లోని నారాయణ్‌గఢ్-ఒడిశాలోని భద్రక్ మధ్య రెల్వే శాఖ మూడో లైన్‌ను నిర్మించేందుకు కేంద్ర మంత్రి మండలి మార్చి 7న ఆమోదం తెలిపింది. ఈ మార్గంలో రద్దీ తీవ్రంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 155 కి.మీ మేర కొత్త ట్రాక్ వేయనున్నారు. ఈ మార్గం నిర్మాణానికి రూ.1,866.31 కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేయగా, 2024 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు వల్ల 37.2 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.
కేంద్ర మంత్రి మండలి మరికొన్ని నిర్ణయాలు
- ముంబై అర్బన్ ట్రాన్స్ పోర్టు ప్రాజెక్టు (ఎంయూటీపీ)లో భాగంగా మూడో దశకు కేంద్ర మంత్రివర్గం సమ్మతించింది. ఇందుకు రూ. 30,849 కోట్ల మేర వ్యయం కావొచ్చని అంచనా వేశారు. ఐదేళ్లలోపు పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- ఢిల్లీలో ప్రతిపాదిత మెట్రో నాలుగో దశలో భాగంగా మరో మూడు కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ముకుంద్‌పూర్-మౌజ్‌పూర్, ఆర్కే ఆశ్రమ్-జనక్‌పురి వెస్ట్, ఏరోసిటీ-తుగ్లకాబాద్ మధ్య వీటి నిర్మాణం జరగనుంది. ఇందులోభాగంగా 17 భూగర్భ స్టేషన్లు, 29 ఎలివేటెడ్ స్టేషన్లను నిర్మిస్తారు.
ఏమిటి : బెంగాల్-ఒడిశా మధ్య మూడోలైన్‌కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : కేంద్ర మంత్రి మండలి
అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వం
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దశాబ్దాలుగా నలుగుతున్న రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ఈ కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. రాజకీయంగా సున్నితమైన ఈ కేసులో మధ్యవర్తిత్వం వహించేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కోర్టు నియమించింది. ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌తోపాటు సీనియర్ న్యాయవాది, మధ్యవర్తిగా మంచి పేరు గడించిన శ్రీరామ్ పంచు ఈ త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉంటారు. మరో వారంలో మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించి 8 వారాల్లో ముగించాలని రాజ్యాంగ ధర్మాసనం మార్చి 8న ఆదేశించింది.
అయోధ్యలో వివాదంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని నిర్మోహి అఖాడా, రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డ్‌లకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 అప్పీళ్లు దాఖలయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అయోధ్య వివాదంపై మధ్యవర్తిత్వం
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : సుప్రీంకోర్టు
ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 8న శంకుస్థాపన చేశారు. అలాగే లక్నో ఉత్తర-దక్షిణ కారిడార్ మెట్రో సేవలను ప్రారంభించిన ఆయన వారణాసిలోని కాశీవిశ్వనాథ్ ఆలయం అప్రోచ్ రోడ్డు-సుందరీకరణ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. మరోవైపు లక్నోలో ఇటీవల కశ్మీరీ వ్యాపారులపై కొందరు దుండగులు దాడిచేసిన నేపథ్యంలో ప్రధాని స్పందించారు. దేశవ్యాప్తంగా కశ్మీరీలపై దాడులు చేస్తున్న అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఆగ్రా, ఉత్తరప్రదేశ్
రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు శంకుస్థాపన
ఉత్తరప్రదేశ్‌లోని కుర్జాలో, బిహార్‌లోని బుక్సారిన్‌లో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 9న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 50ఏళ్ల పాత సామగ్రిని వాడటంతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.10కు చేరుకుందని తెలిపారు. కానీ సౌరశక్తి ద్వారా ఇప్పుడు యూనిట్ విద్యుత్‌ను రూ.2కే ఉత్పత్తి చేయొచ్చన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు శంకుస్థాపన
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఉత్తరప్రదేశ్‌లోని కుర్జా, బిహార్‌లోని బుక్సారిన్
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10న విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ఏప్రిల్ 11న తొలి దశ ఎన్నికలు, రెండో దశ ఏప్రిల్ 18, మూడో దశ ఏప్రిల్ 23, నాలుగో దశ ఏప్రిల్ 29, ఐదో దశ మే 6న, ఆరో దశ మే 12, ఏడో దశ మే19న నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకటనతో తక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : కేంద్ర ఎన్నికల సంఘం
బోయింగ్ 737పై భారత్ నిషేధం
బోయింగ్ 737 మ్యాక్స్-8 విమానాలపై భారత ప్రభుత్వం మార్చి 12న నిషేధం విధించింది. విమానాలు సురక్షితమేనని నిర్థారించేందుకు అవసరమైన మార్పులు, భద్రతా చర్యలు చేపట్టేవరకు నిషేధం కొనసాగుతుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ తెలిపింది. అంతేకాకుండా, ఈ విమాన పెలైట్లకు వెయి్య గంటలు, కో పెలైట్‌కు 500 గంటలు నడిపిన అనుభవం ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఇథియోపియా ఎయిర్‌లైన్స్ ప్రమాదం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు బోయింగ్ 737పై ఇప్పటికే నిషేధం విధించాయి. ఇథియోపియా విమాన ప్రమాదంలో ఆరుగురు భారతీయులు సహా 157 మంది ప్రయాణికులు మృత్యువాతపడిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బోయింగ్ 737పై నిషేధం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : భారత్
ప్రభుత్వ సైట్లలో ప్రధాని ఫొటోల తొలగింపు
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ప్రధాని కార్యాలయం సహా వివిధ కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రుల చిత్రాలను తొలగించారు. 2019, ఏప్రిల్ 11 నుంచి లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమవుతాయని ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసీ ప్రకటన నుంచే ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు కోడ్ అమల్లో ఉంటుంది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మంత్రులు, అధికారిక వర్గాలు పథకాలు, వాటికి నిధుల కేటాయింపులు జరపకూడదు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అధికార పార్టీ కానీ, మంత్రులు కానీ ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టకూడదు. అలాగే ప్రచారానికి అధికారులను ఉపయోగించుకోకూడదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ సైట్లలో ప్రధాని ఫొటోల తొలగింపు
ఎప్పుడు : మార్చి 12
ఎందుకు : ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన కారణంగా
భారత పైలట్ వర్ధమాన్ విడుదల
పాకిస్తాన్ అరెస్ట్ చేసిన భారత వాయుసేన(ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌ను మార్చి 1న విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 28న ప్రకటించారు. పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల స్థావరంపై భారత్ ఫిబ్రవరి 26న వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ సందర్భంగా పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత్ నేలకూల్చగా, ఇండియాకు చెందిన రెండు ఫైటర్ జెట్లను కూల్చేశామనీ, వర్ధమాన్ అభినందన్ అనే పైలట్‌ను అరెస్ట్ చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. వర్ధమాన్ అరెస్టును ధ్రువీకరించిన భారత విదేశాంగ శాఖ.. జెనీవా నిబంధనల ప్రకారం అభినందన్ విషయంలో మానవతాదృక్పథంతో వ్యవహరించాలనీ, ఆయన్ను సురక్షితంగా విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత పైలట్ వర్ధమాన్ విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : పాకిస్తాన్
పని విద్య సదస్సు ముగింపులో ఉప రాష్ట్రపతి
హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నయ్ తాలిమ్ (పని విద్య)పై రెండ్రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఫిబ్రవరి 28న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు ఉన్నత విద్యా సంస్థలు ఇతోధిక కృషి చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. మహత్మాగాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ (ఎంజీఎన్‌సీఆర్‌ఈ) ఆధ్వర్యంలో ఈ సదస్సుని నిర్వహించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తాలిమ్ (పని విద్య) సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, హైదరాబాద్
స్వదేశం చేరుకున్న అభినందన్
శత్రు దేశ యుద్ధ విమానాన్ని తరుముతూ సరిహద్దు దాటి వెళ్లి పాకిస్తాన్‌కు చిక్కిన భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్ సురక్షితంగా స్వదేశం చేరుకున్నారు. పాకిస్తాన్ అధికారులు అభినందన్‌ను మార్చి 1న అట్టారీ-వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించారు. వైమానిక దళ అధికారులు, వేలాది మంది ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పాకిస్తాన్ ప్రతీకార దాడుల్ని తిప్పికొట్టే క్రమంలో ఫిబ్రవరి 27న పీఓకేలో మిగ్-21 విమానం కూలిపోయి అభినందన్ పాకిస్తాన్ బలగాలకు దొరికిపోయారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్వదేశం చేరుకున్న భారత వైమానిక దళ పైలట్
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : అభినందన్ వర్థమాన్
ఎక్కడ : అట్టారీ-వాఘా సరిహద్దు
మార్చి 8 నుంచి పోషణ్ అభియాన్ వార్షికోత్సవం
జాతీయ పోషకాహార మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మార్చి 8 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా ‘పోషణ్ అభియాన్’ మొదటి వార్షికోత్సవాన్ని నిర్విహ స్తామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ మార్చి 1న వెల్లడించారు. మూడు రాష్ట్రాల్లో దాదాపు 21 వేల మంది తక్కువ బరువుతో పుట్టిన శిశువులను గుర్తించామని మంత్రి తెలిపారు. వీరంతా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో 2017 అక్టోబర్ నుంచి 2018 అక్టోబర్ మధ్య పుట్టిన వారని చెప్పారు. వారిలో 15 వేల మంది శిశువులను సాధారణ స్థితికి తీసుకొచ్చామని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘పోషణ్ అభియాన్’ మొదటి వార్షికోత్సవం
ఎప్పుడు : మార్చి 8 నుంచి 22 వరకు
ఎవరు : కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : జాతీయ పోషకాహార మిషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో
సంరతా ఎక్స్‌ప్రెస్ సేవలు పునఃప్రారంభం
భారత్-పాక్ మధ్య నడిచే సంరతా ఎక్స్‌ప్రెస్ సేవలు మార్చి 3 నుంచి పునఃప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య పరస్పర అంగీకారంతో ఈ సేవలను పునరుద్ధరించినట్లు మార్చి 2న భారత రైల్వే తెలిపింది. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేసిన మరుసటి రోజే పాక్ సంరతా ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
పాకిస్తాన్‌పై భారత వైమానిక దళం జరిపిన మెరుపుదాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే ఏకై క రైలు సంరతా ఎక్స్‌ప్రెస్‌ను పాక్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ కూడా గత నెల 28న సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సంరతా ఎక్స్‌ప్రెస్ సేవలు పునఃప్రారంభం
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : భారత రైల్వే శాఖ
కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా ఎక్స్‌పో ప్రారంభం
దేశ రాజధాని ఢిల్లీలో కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా ఎక్స్‌పో-2019ను ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 2న ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని సాంకేతిక నిర్మాణ సంవత్సరంగా ప్రకటించారు. గృహనిర్మాణ రంగంలో పెరుగుతున్న అవసరాలను అందు కునేందుకు వీలుగా టెక్నాలజీని విసృ్తతంగా వాడాలని సూచించారు. 2022 నాటికల్లా భార తీయులందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రైవేటు రంగం కూడా సహకరించాలని పిలుపునిచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ ఇండియా ఎక్స్‌పో-2019 ప్రారంభం
ఎప్పుడు : మార్చి 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ
రైఫిళ్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఏకే-203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 3న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ... భారత్-రష్యా ఉమ్మడి భాగస్వామ్యంలో తయారయ్యే ఏకే-203 రైఫిళ్లపై ‘మేడ్ ఇన్ అమేథీ’ అని ఉంటుందని చెప్పారు. భారత రక్షణ బలగాల అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏకే-203 రైఫిళ్ల తయారీ కర్మాగారానికి శంకుస్థాపన
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : అమేథీ, ఉత్తరప్రదేశ్
ఆధార్ వినియోగ ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం
ఆధార్ నంబర్‌ను గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా మొబైల్ సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతాలకు స్వచ్చందంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ మార్చి 3న ఆమోదం తెలిపారు. మొబైల్ సిమ్‌కార్డు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ వినియోగాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆర్డినెన్స్ తో ఇకపై వీటికి ఆధార్‌ను వినియోగించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినప్పటికీ, రాజ్యసభ ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆధార్ వినియోగ ఆర్డినెన్స్ కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
బాంద్రా-జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో బాంద్రా-జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 4న ప్రారంభించారు. అహ్మదాబాద్ మెట్రో మొదటి దశ(6.5కిలోమీటర్లు)ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఉగ్రవాదులు పాతాళంలో దాక్కున్నా వదలిపెట్టబోమని చెప్పారు. బాలాకోట్‌పై ఐఏఎఫ్ దాడి పైలట్‌ప్రాజెక్టు మాత్రమే.. అసలైన దాడులు ఇకపై మొదలవుతాయని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాంద్రా-జామ్‌నగర్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జామ్‌నగర్, గుజరాత్
పాఠ్యాంశంగా అభినందన్ ధైర్యసాహసాలు
భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ధైర్యసాహసాలను స్కూలు విద్యార్థులకు పాఠ్యాంశంగ చేర్చాలని రాజస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర విద్యా మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా మార్చి 5న తెలిపారు. పాకిస్తాన్ సైనికులకు చిక్కి, ప్రాణాలు పోతున్నాయని తెలిసి కూడా అభినందన్ ప్రదర్శించిన పోరాటపటిమ ప్రశంసనీయమని, అది భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల గాథలను కూడా పాఠ్యాంశాలుగా చేర్చాలని ఇటీవలే రాజస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసి, శత్రుదేశానికి పట్టుబడి కూడా సాహసోపేతంగా వ్యవహరించిన అభినందన్ స్వదేశానికి సురక్షితంగా తిరిగివచ్చిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాఠ్యాంశంగా అభినందన్ ధైర్యసాహసాలు
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : రాజస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : రాజస్తాన్
ఆర్మీ శాఖల్లో మహిళా అధికారులు
ఆర్మీలోని మొత్తం పది శాఖల్లో మహిళలు శాశ్వత కమిషన్(పీసీ)లో పనిచేయడానికి వీలు కల్పిస్తూ కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ మార్చి 5న నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్వల్పకాలిక సేవల కమిషన్(ఎస్‌ఎస్‌సీ)ను ఎంపిక చేసుకున్నవారు కూడా పీసీకి దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా రక్షణశాఖ పేర్కొంది. వైమానిక దళం ఇప్పటికే మహిళలను తమ విభాగంలోని అన్ని శాఖల్లో అనుమతిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్మీ శాఖల్లో మహిళలు మహిళలు శాశ్వత కమిషన్(పీసీ)లో పనిచేయవచ్చు
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ
ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన ప్రారంభం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్(పీఎం-ఎస్‌వైఎమ్) యోజన’ను ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 5న ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... మాన్‌ధన్ యోజనను దేశంలోని 42 కోట్ల మంది కూలీలకు అంకితం చేస్తున్నానని అన్నారు. 2019, ఫిబ్రవరి 15 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండి, నెలకు రూ.15,000 కంటే తక్కువగా సంపాదిస్తున్న అసంఘటిత కార్మికులు ఈ పథక ప్రయోజనాలను పొందవచ్చు.
పీఎం-ఎస్‌వైఎమ్ చేరిన వారు 60 ఏళ్లు నిండిన తర్వాత ప్రతినెల రూ.3,000 పెన్షన్‌ను అందుకోవచ్చు. ఇందులో చేరిన వారు 18 ఏళ్ల వయసు ఉన్న వారు నెలకు రూ.55 , 29 ఏళ్ల దాటిన వారు నెలకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
జాతీయ పెన్షను పథకం, ఈఎస్‌ఐలో ఉన్న సభ్యులు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారికి ఈ పథకంలో చేరే అవకాశం లేదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన ప్రారంభం
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : అహ్మదాబాద్, గుజ రాత్
ఐటీబీపీ 53వ బెటాలియన్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కలికిరి సమీపంలో ఏర్పాటైన ఐటీబీపీ (ఇండో టిబెటెన్ బార్డర్ పోలీస్) 53వ బెటాలియన్ కేంద్రాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మార్చి 6న న్యూఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల్లో రూ.1,095 కోట్లతో నిర్మించిన బీఎస్‌ఎఫ్, సీఎఫ్‌ఎస్‌ఎల్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఢిల్లీ పోలీస్, ఐటీబీపీ, ఎల్‌పీఏఐ, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బి కేంద్రాలను కూడా ఆయన ప్రారంభించారు. దేశ రక్షణలో పారామిలటరీ బలగాల సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐటీబీపీ 53వ బెటాలియన్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ఎక్కడ : కలికిరి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా ఇండోర్
దేశంలోనే అత్యుత్తమ పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్‌లోనిఇండోర్ వరుసగా మూడోసారి నిలిచింది. ఈ మేరకు ఢిల్లీలో మార్చి 6న కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షణ్-2019 అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ అవార్డుల జాబితాలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అంబికాపుర్ రెండోస్థానం, కర్ణాటకకు చెందిన మైసూర్ మూడో స్థానం పొందాయి.
అవార్డుల వివరాలు
- అత్యంత స్వచ్ఛమైన నగరంగా ఇండోర్
- అత్యంత స్వచ్ఛమైన రాజధానిగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్
- స్వచ్ఛత కోసం పాటుపడుతున్న మొదటి మూడు రాష్ట్రాలు వరుసగా ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర
- 10లక్షల కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో స్వచ్ఛమైన నగరం(క్లీనెస్ట్ బిగ్ సిటీ)- గుజరాత్‌లోని అహ్మదాబాద్
- 3-10లక్షల జనాభా గల నగరాల్లో స్వచ్ఛ నగరం( క్లీనెస్ట్ మీడియం సిటీ)- ఉజ్జయిని
- 1-3లక్షల జనాభా గల నగరాల్లో స్వచ్ఛ నగరం(స్వచ్ఛమైన చిన్న నగరం) - న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
- ఉత్తమ గంగా పట్టణం(బెస్ట్ గంగా టౌన్)గా ఉత్తరాఖండ్‌లోని గౌచర్
- వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద నగరంగా(ఫాస్టెస్ట్ మూవింగ్ బిగ్ సిటీ) రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)
- ఫాస్టెస్ట్ మూవింగ్ మీడియం సిటీగా మథుర-బృందావన్
స్వచ్ఛ సర్వేక్షణ్-2019 అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు ఏడు అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లూరుపేట, కావలి అవార్డుల జాబితాలో నిలవగా.. తెలంగాణ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్ పీర్జాదిగూడ ఈ ఘనతను నిలబెట్టుకున్నాయి. స్వచ్ఛ నగరాల జాబితా కోసం జనవరి 4 నుంచి 31 వరకు కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. మొత్తం 4,237 పట్టణాలు, నగరాల్లో ఈ సర్వే చేపట్టింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే అత్యుత్తమ పరిశుభ్ర నగరం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : ఇండోర్, మధ్యప్రదేశ్
Published date : 13 Mar 2019 05:16PM