Justice Dipankar Datta: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా దీపాంకర్
Sakshi Education
సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా డిసెంబర్ 12న ప్రమాణంచేశారు.
ఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థానం కోర్టురూమ్ నంబర్1లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దీపాంకర్ చేత ప్రమాణంచేయించారు. జస్టిస్ దత్తా తండ్రి జస్టిస్ సలీల్ కుమార్ గతంలో కలకత్తా హైకోర్టులో జడ్జిగా సేవలందించారు. జస్టిస్ దత్తా ప్రమాణస్వీకారం తర్వాత సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 28కి పెరిగింది. భారత రాజ్యాంగ నిబంధనలప్రకారం చూస్తే సీజేతో కలుపుకుని సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది వరకు జడ్జీలు ఉండొచ్చు. జస్టిస్ దత్తా సుప్రీంకోర్టులో 2030 ఫిబ్రవరి ఎనిమిదో తేదీదాకా జడ్జిగా కొనసాగుతారు.
Published date : 13 Dec 2022 12:31PM