గోప్యత హక్కు సంపూర్ణం కాదు
గోప్యత హక్కు సంపూర్ణమేమీ కాదని, దానికి కూడా పరిమితులు ఉంటాయని కేంద్రం పేర్కొన్నది. ఈ మేరకు సుప్రీంకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. వ్యక్తిగత డిజిటల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటిలోని కంటెంట్‌ను స్వాధీనం చేసుకోవడం, పరిశీలించడం, భద్రపరచడం వంటి వాటికి సంబంధించి దర్యాప్తు సంస్థలను నియంత్రించాలని కోరుతూ.. పలువురు విద్యావేత్తలు, పరిశోధకులతో కూడిన ఓ బృందం పిటిషన్ వేసింది. పరికరాలను సీజ్ చేసేందుకు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుమతి తీసుకొనేలా, నేరానికి ఇవి ఏ విధంగా సంబంధమో తెలిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. వ్యక్తిగత డిజిటల్, ఎలక్ట్రానిక్ పరికరాలను తిరిగి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం.. విచారణలో స్వాధీనం చేసుకొన్న పరికరాలను తిరిగి ఇవ్వడానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట ఆదేశాలు లేవని, అలాంటివి అనుచితమైనవని పేర్కొన్నది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP