Skip to main content

Bilkis Bano Case: బిల్కిస్‌ పిటిషన్‌పై విచారణకు జస్టిస్‌ బేలా త్రివేది విముఖత

బిల్కిస్‌ బానోపై అత్యాచారం కేసులో దోషులను శిక్షాకాలం ముగియక ముందే జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌బేలా ఎం.త్రివేది నిరాకరించారు.

2002లో గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై అత్యాచారం చేయడంతోపాటు ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన 11 మంది దోషులను గుజరాత్‌ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15న జైలు నుంచి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిల్కిస్‌ బానో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం ముందుకువచ్చింది. అయితే, పిటిషన్‌పై విచారణకు జస్టిస్‌ బేలా ఎం.త్రివేది విముఖత వ్యక్తం చేశారు. అందుకు గల కారణాలు వెల్లడించలేదు. పిటిషన్‌ను కొత్త ధర్మాసనం విచారణకు స్వీకరిస్తుందని కోర్టు తెలిపింది.   

National Sports Awards: జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం

Published date : 14 Dec 2022 05:33PM

Photo Stories