Unemployment Rate: దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం
Sakshi Education
భారత్‌లో నిరుద్యోగం రోజు రోజుకీ ఎక్కువైపోతోంది. డిసెంబర్‌లో అత్యధికంగా 8.3% శాతానికి నిరుద్యోగం రేటు ఎగబాకింది.
గత 16 నెలల్లో అదే అత్యధికమని సెంటర్ ఫర్ మోనటిరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఒక నివేదికలో తెలిపింది. పట్టణాల్లో నిరుద్యోగ రేటు 2022 నవంబర్‌లో 8.96 ఉంటే, డిసెంబర్ వచ్చేసరికి 10.09 శాతానికి పెరిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం రేటు నవంబర్‌లో 7.55% ఉంటే స్వల్పంగా తగ్గి డిసెంబర్ నాటికి 7.44శాతానికి చేరుకుంది. నిరుద్యోగం రేటు అత్యధికంగా హర్యానాలో 37.4% ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్ (28.5%), ఢిల్లీ (20.8%) ఉన్నాయి.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
Published date : 02 Jan 2023 11:47AM