India 's 15th President : ద్రౌపదీ ముర్మ
సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన గిరిజన ముద్దుబిడ్డ ద్రౌపదీ ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. తద్వారా దేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి రాష్ట్రపతిగానే గాక ఇప్పటిదాకా ఆ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచారు. అధికార ఎన్డీఏ తరఫున బరిలో దిగిన ముర్ము జూలై 21న జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు మూడింట రెండొంతల మెజారిటీతో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారసురాలిగా 25వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవి అధిష్టించనున్న రెండో మహిళ ముర్ము.
Also read; Weekly Current Affairs (International) Bitbank: అధికారికంగా పేరు మార్చుకున్న దేశం ఏది?
ప్రతి రౌండూ ముర్ముదే
రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న పోలింగ్ జరిగింది. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులైన ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు పార్లమెంట్ హౌస్‌తో పాటు దేశవ్యాప్తంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూలై 21న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్‌లోని 63వ నంబర్ గదిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. తొలుత పార్లమెంటు సభ్యుల ఓట్లు లెక్కించారు. అనంతరం అక్షర క్రమంలో రాష్ట్రాలవారీగా ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. అంతా ఊహించినట్టుగానే కౌంటింగ్ ప్రారంభం నుంచే సిన్హాపై ముర్ము నిర్ణాయక ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చారు. ప్రతి రౌండ్‌లోనూ దాదాపు మూడింట రెండొతుల ఓట్లతో దూసుకెళ్లారు. మూడో రౌండ్‌లోనే 50 శాతం ఓట్లు దాటేసి విజయానికి అవసరమైన మెజారిటీ మార్కు సాధించారు. అప్పటికి మరో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఓట్ల లెక్కింపు మిగిలే ఉంది. చివరిదైన నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిశాక ముర్ము విజయాన్ని చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పీసీ మోదీ అధికారికంగా ప్రకటించారు.
Also read; Gita Gopinath: గీతా గోపీనాథ్‌కు అరుదైన గౌరవం
- మొత్తం 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు కలిపి ఎలక్టోరల్ కాలేజీలో 4,809 మంది సభ్యులున్నారు. వీరిలో4,754 మంది ఓటేశారు. వారి మొత్తం ఓట్ల విలువ 10,72,377.
- వాటిలో ముర్ము 64.03 శాతం ఓట్లు సాధించగా సిన్హా 36 శాతంతో సరిపెట్టుకున్నారు. ముర్ముకు 6,76,803 పోలవగా సిన్హాకు 3,80,177 పడ్డాయి.
- 2,824 మంది ప్రజాప్రతినిధులు ముర్ముకు, 1,877 మంది సిన్హాకు ఓటేశారు.
- 15 మంది ఎంపీలతో పాటు మొత్తం 53 మంది ఓట్లు చెల్లకుండా పోయాయి.
- ఎంపీల ఓట్లలో 540 (72.19 శాతం) ముర్ముకే పడ్డాయి. సిన్హాకు 208 మంది ఓటేశారు.
- 17 మంది ఎంపీలతో పాటు దాదాపు 125 మందికి పైగా విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేసినట్టు తేలింది.
- ముర్ముకు యూపీ, మహారాష్ట్ర, ఏపీల నుంచి అత్యధిక ఓట్లు వచ్చాయి. సిన్హాకు పశ్చిమబెంగాల్, తమిళనాడు నుంచి అత్యధిక ఓట్లు పడ్డాయి.
- ఆంధ్రప్రదేశ్, సిక్కింలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా, నాగాలాండ్‌లో మొత్తం ఎమ్మెల్యేలూ ముర్ముకే ఓటేశారు.
- కేరళ నుంచి దాదాపుగా అన్ని ఓట్లూ సిన్హాకే పడ్డాయి.
మొత్తం ఓట్ల విలువ 10,72,377
ముర్ముకు ఓట్లు - 6,76,803
సిన్హాకు ఓట్లు - 3,80,177
Also read; Weekly Current Affairs (International) Bitbank: అధికారికంగా పేరు మార్చుకున్న దేశం ఏది?
ముర్ము ప్రస్థానం
పేరు: ద్రౌపది ముర్ము
పుట్టిన తేదీ: జూన్ 20, 1958
పుట్టిన ఊరు: ఉపర్‌బేడ, మయూర్‌భంజ్, ఒడిశా
వయస్సు: 64 ఏళ్లు
తండ్రి: బిరంచి నారాయణ్ తుడు
రాజకీయ పార్టీ: బీజేపీ
చదువు: రమాదేవి విమెన్స్ యూనివర్సిటీ నుంచి బీఏ
చేపట్టిన పదవులు: జార్ఖండ్ గవర్నర్, ఒడిశా రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక, వాణిజ్యం, రవాణా శాఖలు
సంతానం: ఇతిశ్రీ ముర్ము (బ్యాంకు ఉద్యోగి)
భర్త: శ్యాం చరణ్ ముర్ము (2014లో మృతి)
Also read; Weekly Current Affairs (Persons) Bitbank: సశాస్త్ర సీమ బల్ కొత్త డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP