IISER Bhopal Chapter: భారతీయ ఆవు జాతులు–జన్యుపరమైన ఆకృతి ఆవిష్కరణ
Sakshi Education
పాశ్చాత్య జాతులతో పోలిస్తే భారతీయ ఆవు జాతుల జన్యువుల్లో నిర్మాణ వైవిధ్యం ఉందని.. అందుకే అవి భారత్‌లోని వేడి వాతావరణాన్ని తట్టుకొంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఆండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్) భోపాల్ చాప్టర్ శాస్త్రవేత్తలు మొదటిసారిగా భారతీయ ఆవు జాతులైన కాసర్‌గోడ్ ద్వార్ఫ్, కాసర్‌గోడ్ కపిల, వేచూర్, ఒంగోలు ఆవు జాతుల జన్యుపరమైన ఆకృతిని గుర్తించారు. వ్యాధులను తట్టుకొనేలా దేశీయ ఆవు జాతుల్లో ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.
Published date : 06 Feb 2023 03:18PM