Defense Sector: రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’కు పెద్దపీట
Sakshi Education
రక్షణ రంగంలో ‘ఆత్మ నిర్భర్ భారత్’కు పెద్దపీట వేస్తూ కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన డిఫెన్స్ అక్విజిషన్స్ కౌన్సిల్(డీఏసీ) రూ.76,390 కోట్ల విలువైన సైనిక ఆధునికీకరణ ప్రాజెక్టులకు ప్రాథమిక ఆమోదం తెలిపింది. సైనిక పరికరాల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించడానికి, తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. భారతీయ రక్షణ పరిశ్రమకు ప్రోత్సాహాన్నీ అందిస్తుందని చెప్పారు.
Published date : 14 Jun 2022 07:51PM