Skip to main content

Ordnance Factory Board: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను విలీనం చేసింది?

PM Modi

రక్షణరంగ ఉత్పత్తులకు సంబంధించి కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు కార్పొరేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్‌ 15న ప్రారంభించారు. ఢిల్లీలోని డీఆర్డీఓ భవన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్, డిఫెన్స్‌ ప్రొడక్షన్, డిఫెన్స్‌ మినిస్ట్రీ కింద దేశ వ్యాప్తంగా ఉన్న 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలతో ఈ కొత్త సంస్థలు ఏర్పడ్డాయి. ఈ సంస్థలు సాయుధ దళాలకు సంబంధించి వివిధ రకాల ఉత్పత్తులను సరఫరా చేయనున్నాయి. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ... ఈ ఏడు సంస్థలు వంద శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయని పేర్కొన్నారు.

కొత్తగా ఏర్పాటైన ఏడు సంస్థలు...

1 . యంత్రా ఇండియా లిమిటెడ్‌ (YIL)
2. అడ్వాన్స్‌డ్‌ వెపన్స్‌ అండ్‌ ఎక్విమెంట్‌ ఇండియా లిమిటెడ్‌ (AWE India)
3. ఆర్మర్డ్‌ వెహికిల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (AVANI)
4. ట్రూప్‌ కంఫోర్ట్స్‌ లిమిటెడ్‌ (TCL)
5. మునిషన్స్‌ ఇండియా లిమిటెడ్‌ (MIL)
6. ఇండియా ఆప్టెల్‌ లిమిటెడ్‌ (IOL)
7. గ్లైడర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (GIL)
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను విలీనం చేస్తూ ఏర్పాటు చేసిన ఏడు కొత్త సంస్థల ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్‌ 16
ఎవరు    : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : డీఆర్డీఓ భవన్, ఢిల్లీ
ఎందుకు : సంస్థల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు...

చ‌ద‌వండి: కలాం సెంటర్‌ ఫర్‌ టెక్నాలజీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 18 Oct 2021 04:13PM

Photo Stories