Skip to main content

DRDO Chairman: కలాం సెంటర్‌ ఫర్‌ టెక్నాలజీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

DRDO-Satheesh Reddy

కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ, కశ్మీర్‌లోని సాంబ జిల్లాలో ఉన్న జమ్మూ సెంట్రల్‌ యూనివర్సిటీ(సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జమ్మూ)లో కలాం సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(కేసీఎస్‌టీ) ఏర్పాటు కానుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కేసీఎస్‌టీకు అక్టోబర్‌ 14న డీఆర్‌డీవో చీఫ్‌ జి.సతీశ్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం సతీశ్‌ రెడ్డి మాట్లాడుతూ... తాము సొంతంగా అభివృద్ధి పరిచిన యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని రక్షణ రంగ పరిశ్రమలకు అందజేసినట్లు వెల్లడించారు. శత్రు డ్రోన్లపై నిఘా వేసి, గుర్తించి, వెంటాడేందుకు అవసరమైన అన్ని సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ వ్యవస్థలు ఈ టెక్నాలజీలో ఉన్నాయన్నారు. ఈ కొత్త వ్యవస్థలను పలుమార్లు విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొన్నారు. 1958లో ఏర్పాటైన డీఆర్‌డీవో ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
 

చ‌ద‌వండి: నేషనల్‌ సైన్స్‌ యూనివర్సిటీకి ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కలాం సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(కేసీఎస్‌టీ) ఏర్పాటుకు శంకుస్థాపన
ఎప్పుడు : అక్టోబర్‌ 14
ఎవరు    : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) చీఫ్‌ జి.సతీశ్‌రెడ్డి
ఎక్కడ    : జమ్మూ సెంట్రల్‌ యూనివర్సిటీ(సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జమ్మూ), సాంబ జిల్లా, జమ్మూ, కశ్మీర్‌
ఎందుకు : శాస్త్ర, సాంకేతిక రంగంలో పరిశోధనలకు...

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 Oct 2021 01:47PM

Photo Stories