High Court of Delhi: ఆ పరీక్షలు చేయడం రాజ్యాంగ విరుద్ధం: ఢిల్లీ హైకోర్టు
జ్యుడీషియల్ కస్టడీలో అయినా, పోలీస్ కస్టడీలో అయినా ఇలాంటి ఘటనలు అమానవీయమని, మహిళల గౌరవానికి భంగకరమని వ్యాఖ్యానించింది. కన్యత్వ పరీక్షలు నిర్వహించడానికి చట్టపరంగా ఎలాంటి అనుమతులు లేవని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువరించారు. కేరళలో 1992 మార్చి 27న సిస్టర్ అభయ అనే మహిళ మరణించింది. బావిలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. 2020లో సిస్టర్ సెఫీని కేసులో దోషిగా నిర్ధారించింది. కోర్టులో నేరాన్ని రుజువు చేయడం కోసం 2008 సెఫీకి కన్యత్వ పరీక్షలు చేయించింది. సీబీఐ తనకు కన్యత్వ పరీక్షలు చేయించడాన్ని సవాల్ చేస్తూ.. ఇటీవల సిస్టర్ సెఫీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ విచారణ జరిపిన న్యాయస్థానం తాజా తీర్పును వెల్లడించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP