Skip to main content

Draupadi Murmu : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారు.. ఈమె ప్ర‌స్థానం ఇదే..

న్యూఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన నేత ద్రౌపది ముర్ము పేరు ఖరారైంది.
Draupadi Murmu
Draupadi Murmu

జూన్ 21వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముర్ము పేరును అధికారికంగా ప్రకటించారు. ఆదివాసీ మహిళ అయిన ముర్ము 2015-2021 వరకు జార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేశారు. జార్ఖండ్‌ తొలి మహిళా గవర్నర్‌గా ప‌నిచేశారు. 2000- 2004 మధ్య కాలంలో ప్రస్తుత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో రవాణా, ఫిషరీష్ మంత్రిగా పని చేశారు.  రాజకీయాల్లోకి రాక ముందు ముర్ము టీచర్‌గా పని చేశారు. ఈమె కౌన్సిల‌ర్‌గా రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె వయసు 64 సంవత్సరాలు. ఈమె భ‌ర్త శ్యామ్ చ‌ర‌ణ్ ముర్ము, ఇద్ద‌రు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఒక వేళ ఈమె రాష్ట్రపతి ఎన్నిక‌ల్లో నెగ్గితే రాజ్యాంగబద్ధ‌ అత్యున్న‌త ప‌ద‌వికి ఎన్నికైన తొలి ఆదివాసి మ‌హిళ‌గాకు చ‌రిత్ర లిఖించ‌నున్నారు.

ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా ఖ‌రారు..

ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాను ఖరారు చేశారు. ఈ మేరకు జైరాం రమేష్‌ అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్‌ ఎన్‌ఎక్స్‌ భవన్‌లో సమావేశమైన 18 విపక్ష పార్టీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. 2002లో కేంద్ర విదేశాంగశాఖ మంత్రిగా యశ్వంత్‌ సిన్హా పనిచేశారు. 2018లో యశ్వంత్‌ సిన్హా బీజేపీకి రాజీనామా చేశారు. 2021లో తృణమూల్‌లో చేరారు. కాయస్త బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన యశ్వంత్‌ సిన్హా జూన్ 21వ తేదీన (మంగళవారం) ఉదయం టీఎంసీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం ఉదయం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

సర్వీస్సులో ఉండ‌గానే..

President of India Elections


బీహార్‌, పాట్నాలో పుట్టిపెరిగిన యశ్వంత్‌ సిన్హా..  ఐఏఎస్‌ అధికారి. ఆపై దౌత్యవేత్తగానూ తరపున పని చేశారు. సర్వీస్సులో ఉండగానే రాజీనామా చేసిన ఆయన 1984లో జనతా పార్టీలో చేరారు. నాలుగేళ్లకు రాజ్యసభకు వెళ్లారు. జనతా దళ్‌ ప్రభుత్వంలో.. పార్టీ జనరల్‌ సెక్రటరీగా పని చేశారు. ఆపై చంద్రశేఖర్‌ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఏడాది పాటు పని చేశారు. 1996లో బీజేపీ అధికార ప్రతినిధిగా పని చేసిన యశ్వంత్‌ సిన్హా.. 22 ఏళ్ల పాటు బీజేపీలోనే కొనసాగారు. లోక్‌సభ ఎంపీగా, పార్టీ కీలక ప్రతినిధిగా, ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో బీజేపీ పాలనను బహిరంగంగానే విమర్శిస్తూ పార్టీని వీడి.. కిందటి ఏడాది టీఎంసీలో చేరారు.

Yashwant Sinha: ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా ఖ‌రారు.. ఈయ‌న ప్ర‌స్థానం ఇదే..

Published date : 21 Jun 2022 10:56PM

Photo Stories