Bill & Melinda Gates Foundation: కోవిడ్ కట్టడిలో భారత్ భేష్
ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒక వేళ కోవిడ్ సమర్థ నిర్వహణ అంశం ఉండి ఉంటే భారత్ ఈ విషయంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను పొంది ఉండేదని బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్‌మాన్ వ్యాఖ్యానించారు. ఫౌండేషన్ ఆరో వార్షిక లక్ష్య సాధకుల (గోల్‌కీపర్స్) నివేదిక విడుదల సందర్భంగా సెప్టెంబర్ 13న ఆయన పీటీఐ వారాసంస్థతో మాట్లాడారు. ‘‘దేశ సమస్యలను పరిష్కరించుకుంటూనే హఠాత్తుగా వచ్చిపడిన కోవిడ్ మహమ్మారి అదుపులో భారత్ విజయం సాధించింది. కోవిడ్ కట్టడికి అవలంబించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శనీయం.
ఆక్సిజన్ కొరతతో కోవిడ్ మరణాలపై ఆడిట్
కరోనా రెండో వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరతతో సంభవించిన మరణాలపై ఆడిట్ చేయించాలని పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి సిఫారసు చేసింది. ఆక్సిజన్ కొరతతో మరణాలు సంభవించాయన్న వాదనను ఆరోగ్య శాఖ కొట్టిపారేయడం దురదృష్టకరమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు పరిహారమివ్వాలని పేర్కొంది. కమిటీ తన 137వ నివేదికను సోమవారం రాజ్యసభకు సమరి్పంచింది. కేసులు భారీగా పెరిగిపోవడంతో ఆరోగ్య మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని తెలిపింది. రాష్ట్రాలకు అవసరాలను అనుగుణంగా సిలిండర్లను పంపిణీ చేయలేక తీవ్ర సంక్షోభానికి కేంద్రం కారణమైందని తప్పుబట్టింది. క్యాన్సర్‌ను గుర్తించదగిన వ్యాధిగా పేర్కొనాలని మరో నివేదికలో కేంద్రానికి సూచించింది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP