Assam & Mizoram: అసోం–మిజోరం సీఎంల మధ్య ఒప్పందం
అసోం–మిజోరం రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతరాష్ట్ర సరిహద్దు వివాదాలను సంయుక్తంగా పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఫిబ్రవరి 9న ఒప్పందం కుదిరింది. అసోం–మిజోరం రాష్ట్రాల మధ్య మిజోరంలోని ఐజ్వాల్, కోలాసిబ్, మమిట్ జిల్లాలు.. అసోంలోని చాచర్, కరీమ్‌గంజ్, హైలన్æ కండి జిల్లాలు.. 164.6 కిలోమీటర్ల పొడవు సరిహద్దును పంచుకుంటున్నాయి. బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ –1873 కింద 1875లో నోటిఫై చేసిన ప్రకారం–ఇన్నర్‌లైన్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 509 చదరపు మైళ్ల విస్తీర్ణం తమదేనని మిజోరం వాదిస్తోంది. మరోవైపు 1933లో సర్వే ఆఫ్ ఇండియా గీసిన రాజ్యాంగ సరిహద్దు ప్రకారం–తమ భూభాగమే మిజోరంలో ఉందని అసోం పేర్కొంటోంది. ఇన్నర్‌లైన్ రిజర్వ్‌డ్ ఫారెస్ట్ ప్రస్తుతం అసోంలో ఉండగా.. 1933 సరిహద్దు ప్రకారం అసోంలో ఉండాల్సిన ఏరియా మిజోరంలో ఉంది. నాడు క్షేత్ర స్థాయిలో ఎలాంటి సరిహద్దులు గీయకపోవడం రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసింది.