Jammu Kashmir: కొత్త నియోజకవర్గాలను ప్రతిపాదించిన డీలిమిటేషన్ కమిషన్
ఎస్‌సీలు, ఎస్టీలకు 16 నియోజకవర్గాలను రిజర్వు చేసింది. ప్రస్తుతం కశ్మీర్ డివిజన్‌లో 46, జమ్మూ డివిజన్‌లో 37 అసెంబ్లీ సీట్లున్నాయి. అయితే, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి చెందిన 24 అసెంబ్లీ స్థానాలు కశ్మీర్ అసెంబ్లీలో ఖాళీగానే కొనసాగుతాయి. 2019 ఆగస్ట్‌లో జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, 2020 ఫిబ్రవరిలో పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా దేశాయ్ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఐదుగురు లోక్‌సభ ఎంపీలు అసోసియేట్ సభ్యులుగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్‌చంద్ర ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నారు. డిసెంబర్ 20వ తేదీన జరిగిన కమిషన్ మొట్టమొదటి సమావేశానికి ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా బీజేపీ ఎంపీలు ఇద్దరు హాజరయ్యారు.