Reservations: పదోన్నతుల్లో దివ్యాంగులకు 4శాతం రిజర్వేషన్
నిర్దేశిత వైకల్యమున్న ఉద్యోగులకు అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించే విషయమై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వికలాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్ –34ను అనుసరించి.. ప్రభుత్వ విభాగాల్లో నిర్దేశిత వైకల్యమున్న ఉద్యోగులకు(పీడబ్ల్యూబీడీలకు) రిజర్వేషన్లు కల్పిస్తూ మార్గదర్శకాలు జారీచేయాలని సుప్రీంకోర్టు గత సెప్టెంబరులో కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు–గ్రూప్–సి, గ్రూప్–సి నుంచి గ్రూప్ బి, గ్రూప్–బి, గ్రూప్–బి నుంచి దానికంటే దిగువ స్థాయి వరకూ ఉన్న కేడర్లలోని మొత్తం ఖాళీల్లో 4శాతం పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేటాయించాలంటూ సిబ్బంది, శిక్షణ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల కార్యదర్శులకూ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రత్యక్ష నియామకాలు 75శాతం మించని కేడర్లలో చేపట్టే పదోన్నతులకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్