Skip to main content

Stamp Duty: మహిళా పారిశ్రామికవేత్తలకు స్టాంప్‌ డ్యూటీలో 100 శాతం మినహాయింపు.. ఎక్క‌డంటే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలకు స్టాంప్‌ డ్యూటీలో 100% మినహాయింపునిచ్చింది.
stamp duty

ప్రమోటింగ్ లీడర్‌షిప్ అండ్ ఎంటర్‌ప్రైజ్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ గ్రోత్ ఇంజిన్ (PLEDGE) పథకం కింద ప్రైవేట్ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్న వారికి, అభివృద్ధి చేసిన పార్కులలో పారిశ్రామిక భూమిని కొనుగోలు చేసిన‌/లీజుకు తీసుకున్న‌ మహిళా పారిశ్రామికవేత్తలకు స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఉంటుంది. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సెక్రటరీ లీనా జోహ్రీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వుల‌ ప్రకారం, రాష్ట్రంలోని తూర్పు యూపీ, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో 100 శాతం, మధ్య, తూర్పు యూపీలో 75 శాతం, గౌతమ్ బుద్ధ నగర్‌లో 50 శాతం మహిళా పారిశ్రామికవేత్తలకు 100 శాతం స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఉంటుంది. అలాగే హెరిటేజ్ హోటళ్ల అభివృద్ధికి భవనాలు, అనుబంధిత భూమిని ఒకే వ్య‌క్తి వేరు వేరుగా రెండు సార్లు కొనుగోలు చేసిన వారికి స్టాంప్ డ్యూటీలో 100 శాతం మినహాయింపు ఉంటుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్ ఎనర్జీ యూనిట్లు, సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు, సోలార్ ఎనర్జీ పార్కుల ఏర్పాటుకు 100 శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వ‌నుంది.

 Google: చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నందుకు గూగుల్‌కు రూ.260 కోట్లు ఫైన్

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు నిర్వ‌హించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో ప్ర‌తిపాదించిన‌ రూ.33.50 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు వివిధ శాఖలు నోటిఫై చేస్తున్న 25 రంగాల పాలసీల స్థితిని ఆ రాష్ట్ర‌ పారిశ్రామికాభివృద్ధి మంత్రి నంద్ గోపాల్ గుప్తా నంది సమీక్షించారు. ఈ మేర‌కు ఆగస్టు 2023లో ఇప్ప‌టికే ప్రతిపాదించిన శంకుస్థాపన కార్యక్రమాల‌కు రూ.10 లక్షల కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Income Tax: ఆకర్షణీయంగా కొత్త ఆదాయపన్ను విధానం.. ఇక‌పై జీవిత బీమా పాలసీలపైనా ప‌న్ను..!

Published date : 14 Apr 2023 12:59PM

Photo Stories