United Nations: అణు కార్యక్రమాలకు నిధుల కోసం సైబర్ దాడులు చేస్తోన్న దేశం?
అణు, మిసైల్ కార్యక్రమాలకు నిధుల కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై ఉత్తర కొరియా సైబర్ దాడులకు తెగబడుతోందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. సైబర్ స్పెషలిస్టులను ఉటంకిస్తూ... ఉత్తర కొరియాపై ఆంక్షలను పర్యవేక్షించే ఐరాస నిపుణుల ప్యానల్ ఫిబ్రవరి 7న ఈ మేరకు వెల్లడించింది.
డీపీఆర్‌కే అంటే..
ఐరాస ప్యానల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాల్లోని మూడు క్రిప్టో ఎక్స్‌చేంజీల నుంచి 2020 నుంచి 2021 మధ్య కనీసం 5 కోట్ల డాలర్లను ఉత్తర కొరియా కొట్టేసింది. అలాగే వాటిపై ఏడుసార్లు సైబర్ దాడులకు తెగబడి 40 కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీనీ దొంగిలించింది. కాజేసిన ఈ నిధులను డీపీఆర్‌కే నియంత్రిత అడ్రస్‌లకు తరలిస్తోంది. 2019–2020 మధ్య కూడా సైబర్ దాడుల ద్వారా 32 కోట్ల డాలర్లకు పైగా ఉత్తర కొరియా కొట్టేసింది. డీపీఆర్‌కే అంటే డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా.
చదవండి: ఏ దేశ ప్రధానిని రహస్య ప్రదేశంలోకి తరలించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై ఉత్తర కొరియా సైబర్ దాడులకు తెగబడుతోంది.
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : ఉత్తర కొరియాపై ఆంక్షలను పర్యవేక్షించే ఐరాస నిపుణుల ప్యానల్
ఎందుకు : అణు, మిసైల్ కార్యక్రమాలకు నిధుల కోసం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్