European Union: ఈయూలో తమకు సభ్యత్వమివ్వాలని విజ్ఞప్తి చేసిన దేశం?
యూరోపియన్ యూనియన్(ఈయూ)లో తక్షణమే తమకు సభ్యత్వమివ్వాలని ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక విధానంతో కూటమిలో తమకు వెంటనే చోటు కల్పించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫిబ్రవరి 28న ఈయూను కోరారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. యూరోపియన్లతో కలిసి ఉండడమే తమ లక్ష్యమని, ముఖ్యంగా సమానత్వ సాధన అవసరమని చెప్పారు. రష్యా దాడిలో ఉక్రెయిన్ పిల్లలు 16 మంది చనిపోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ ప్రతిదాడిలో దాదాపు 4,500 మంది రష్యా సైనికులు మరణించారన్నారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య భారీ యుధ్దం జరుగుతున్న విషయం విదితమే.
యుద్ధ రంగంలోకి మాజీ ‘మిస్ ఉక్రెయిన్’
తమ దేశంపై దండెత్తిన రష్యా దళాలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ ప్రజలు వీరోచిత పోరాటం సాగిస్తున్నారు. ఉక్రెయిన్ సైన్యానికి తోడుగా వేలాది మంది ఆయుధాలు ధరించి, రణభూమిలోకి ప్రవేశిస్తున్నారు. ప్రముఖ మోడల్, మాజీ ‘మిస్ ఉక్రెయిన్’ అనస్టాసియా లెన్నా కూడా ఆయుధం చేబూనారు.
ఈయూలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య? చెక్ రిపబ్లిక్ దేశ రాజధాని?
ఐరోపా దేశాల సమాఖ్య(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగిన తర్వాత.... ఈయూలో 27 దేశాలు సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఈయూ దేశాల ఉమ్మడి కరెన్సీ: యూరో
ఈయూలోని27 సభ్య దేశాలు...
సంఖ్య |
దేశం |
రాజధాని |
1 |
ఆస్ట్రియా |
వియన్నా |
2 |
బెల్జియం |
బ్రస్సెల్స్ |
3 |
బల్గేరియా |
సోఫియా |
4 |
క్రొయేషియా |
జాగ్రెబ్ |
5 |
సైప్రస్ |
నికోసియా |
6 |
చెక్ రిపబ్లిక్ |
ప్రాగ్ |
7 |
డెన్మార్క్ |
కోపెన్‌హాగన్ |
8 |
ఎస్టోనియా |
తల్లిన్‌న |
9 |
ఫిన్లాండ్ |
హెల్సింకీ |
10 |
ఫ్రాన్స్ |
పారిస్ |
11 |
జర్మనీ |
బెర్లిన్ |
12 |
గ్రీస్ |
ఏథెన్స్ |
13 |
హంగేరి |
బుడాపెస్ట్ |
14 |
ఐర్లాండ్ |
డబ్లిన్ |
15 |
ఇటలీ |
రోమ్ |
16 |
లాట్వియా |
రీగా |
17 |
లిథువేనియా |
విల్నియస్ |
18 |
లక్సెంబర్గ్ |
లక్సెంబర్గ్ సిటీ |
19 |
మాల్టా |
వలెట్టా |
20 |
నెదర్లాండ్స్ |
ఆమ్‌స్టర్‌డ్యామ్ |
21 |
పోలాండ్ |
వార్సా |
22 |
పోర్చుగల్ |
లిస్బన్ |
23 |
రొమానియా |
బుకారెస్ట్ |
24 |
స్లొవేకియా |
బ్రాటిస్లావా |
25 |
స్లొవేనియా |
ల్యుబ్‌ల్యానా |
26 |
స్పెయిన్ |
మాడ్రిడ్ |
27 |
స్వీడన్ |
స్టాక్‌హోమ్ |
క్విక్ రివ్యూ :
ఏమిటి : యూరోపియన్ యూనియన్(ఈయూ)లో తమకు సభ్యత్వమివ్వాలని విజ్ఞప్తి చేసిన దేశాధ్యక్షుడు?
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
ఎందుకు : యూరోపియన్లతో కలిసి ఉండడమే తమ లక్ష్యమని, ముఖ్యంగా సమానత్వ సాధన అవసరమని..
Russia-Ukraine War: ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా విమానం ఏది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్