Russia-Ukraine War: ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా విమానం ఏది?
ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా విమానంగా పేరొందిన ‘‘ఆంటోనోవ్ ఏఎన్–225 లేదా మ్రియా(స్వప్నం)’’ను రష్యా సైనికులు నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని హోస్టోమెల్ ఎయిర్‌బేస్‌లో మరమ్మతు కోసం నిలిపి ఉంచిన మ్రియాపై రష్యా జవాన్లు దాడికి పాల్పడ్డారని, విమానం చాలావరకు ధ్వంసమైందని ఉక్రెయిన్ అధికారులు ఫిబ్రవరి 28న ప్రకటించారు. బాహుబలి లాంటి మ్రియాను మళ్లీ నిర్మించుకుంటామని వెల్లడించారు.
ఏమిటీ మ్రియా?
- మ్రియా అని ముద్దుగా పిలుచుకునే ఆంటోనోవ్ ఏఎన్–225 విమానం వెడల్పు 290 అడుగులు. పొడవు 275 అడుగులు. ఎత్తు 59 అడుగులు.
- 1980వ దశకంలో సోవియట్ యూనియన్ హయాంలో కీవ్‌కు చెందిన ఆంటోనోవ్ కంపెనీ నిర్మించింది.
- అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అప్పటి అవసరాల కోసం ఈ విమానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
- సోవియట్ యూనియన్ పతనం తర్వాత సరుకు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. ఇతర దేశాలు సైతం ప్రకృతి విపత్తుల సమయంలో మ్రియాను ఉపయోగించుకుంటున్నాయి.
- కొన్ని నెలల క్రితం కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో మ్రియా విమానంలో ఔషధాలు, వైద్య పరికరాలను చేరవేశారు. 1988 నుంచి నిరంతరాయంగా సేవలందిస్తూనే ఉంది.
- వైమానిక రంగంలో ఉక్రెయిన్ శక్తిసామర్థ్యాలకు మ్రియాను ఒక ప్రతీకగా భావిస్తుంటారు.
Russia-Ukraine War: రష్యా–ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగిన ప్రాంతం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా విమానంగా పేరొందిన ‘‘ఆంటోనోవ్ ఏఎన్–225 లేదా మ్రియాపై దాడి
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : రష్యా సైనికులు
ఎక్కడ : కీవ్, ఉక్రెయిన్
ఎందుకు : రష్యాపై ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్