Skip to main content

Chopper Crash: హెలికాప్టర్‌ ప్రమాదంలో మంత్రితో సహా 16 మంది దుర్మరణం

ఉక్రెయిన్ రాజ‌దాని కీవ్ నగరానికి వెలుపల ఉన్న బ్రోవరీ టౌన్‌లోని కిండర్‌గార్డెన్ సమీపంలో జ‌న‌వ‌రి 18న‌(బుధ‌వారం) హెలికాప్టర్‌ కూలిపోవడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, ఉక్రెయిన్‌ అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీ తోసహా సుమారు 16 మంది మృతి చెందారని ఉక్రెయిన్‌ పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఉన్నారని వెల్లడించారు. మరో 10 మంది పిల్లలు సహా 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఈశాన్య కీవ్‌కు 20 కిలోమీటర్ల దూరంలో బ్రోవరీ టౌన్ ఉంది. బ్రోవరీ పట్టణాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు ఇటీవల రష్యా బలగాలు ప్రయత్నించగా, ఉక్రెయిన్ బలగాలు గట్టిగా ప్రతిఘటించాయి.

Nepal Plane Crash: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం 72 మంది దుర్మరణం!

 

Published date : 18 Jan 2023 03:59PM

Photo Stories