British Minister: UK మంత్రి గావిన్ విలియమ్సన్ తన పదవికి రాజీనామా
Sakshi Education
లండన్: బ్రిటన్లో ప్రధాని రిషి సునాక్ కేబినెట్ నుంచి గవిన్ విలియమ్సన్ రాజీనామా చేశారు. తోటి ఎంపీలపై నోరుపారేసుకుంటారని, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తారని ఆయనపై గతంలోనే విమర్శలు ఉన్నాయి. తాజా మాజీ కన్జర్వేటివ్ పార్టీ మహిళా చీఫ్ విప్ విండీ మోర్టాన్‌ను ఆయన బెదిరించారని ఆరోపణలున్నాయి.
UK minister Gavin Williamson resigns over bullying claims
మాజీ మహిళా ప్రధాని లిజ్ ట్రస్‌కు సాయపడలేదని, బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు తనను ఆహ్వానించలేదని తిడుతూ విండీకి విలియమ్‌సన్ చేసిన మెసేజ్‌లు ఇటీవల మీడియాలో బహిర్గతమవడం తెల్సిందే. మూడేళ్లక్రితం రక్షణమంత్రిగా ఉన్న కాలంలో ఉద్యోగులను నాలుక చీలుస్తానని, కోపంతో కిటికీ నుంచి బయటకు విసిరేస్తానని అరిచేవారని వార్తలొచ్చాయి. ఈ ఆరోపణలు, రాజీనామాపై సునాక్ విచారం వ్యక్తంచేశారు. విలియమ్సన్‌ను గతంలోనూ రెండుసార్లు పదవి నుంచి తప్పించారు.