Skip to main content

Elon Musk: పేరుకే ప్ర‌పంచ కుబేరుడు.. ఆఫీసు అద్దె కూడా క‌ట్ట‌లేడు

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ చేతికి వెళ్లినప్పటి నుంచీ ట్విట్టర్‌ను వరుసబెట్టి కష్టాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న కార్యాలయానికి 1,36,250 డాలర్ల అద్దె చెల్లించడంలో విఫలమవడంతో పరిస్థితి విషయం కోర్టు కేసు దాకా వెళ్లింది!

హార్ట్‌ఫోర్డ్‌ బిల్డింగ్‌లో 30వ అంతస్తులో ఉన్న కార్యాలయానికి బకాయి ఉన్న అద్దెను ఐదు రోజుల్లోగా చెల్లించాలంటూ గత డిసెంబర్‌ 16న యాజమాన్య సంస్థ కొలంబియా రీట్‌ తాఖీదులిచ్చింది. గడువులోగా చెల్లించకపోవడంతో ట్విట్టర్‌పై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసింది! ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ కార్యాలయానికి ట్విట్టర్‌ కొద్ది కాలంగా అద్దె చెల్లించడం లేదంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ డిసెంబర్ 13న ఓ కథనం ప్రచురించింది. రెండు చార్టర్‌ విమానాల అద్దె చెల్లించేందుకు తిరస్కరించినందుకు డిసెంబర్లో కూడా ట్విట్టర్‌పై కేసు నమోదైంది.  

Elon Musk: ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానం కోల్పోయిన మస్క్

Published date : 02 Jan 2023 12:22PM

Photo Stories