Skip to main content

UK home secretary: బ్రిటన్‌ హోం మంత్రి బ్రేవర్మన్‌ రాజీనామా

లండన్‌: భారత సంతతికి చెందిన బ్రిటన్‌ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ రాజీనామా చేశారు. లండన్‌లోని ఆమె కార్యాలయ వర్గాలు ఈ విషయాన్ని అక్టోబర్ 19న  ధ్రువీకరించాయి.
Suella Braverman forced to resign as UK home secretary
Suella Braverman forced to resign as UK home secretary

గోవా మూలాలున్న తండ్రి–తమిళనాడు మూలాలున్న తల్లికి జని్మంచిన బ్రేవర్మన్‌ 43 రోజుల క్రితమే యూకే హోం సెక్రెటరీగా నియమితులయ్యారు. యూకే ఆర్థిక వ్యవస్థ నానాటికీ దిగజారిపోతుండడంతో ప్రధాని లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. బ్రవెర్మన్‌ బుధవారం ఉదయం లిజ్‌ ట్రస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం రాజీనామా సమరి్పంచినట్లు తెలిసింది. ట్రస్‌ విధానాలతో బ్రవెర్మన్‌ విభేదిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ రాజీనామా పరిణామంతో ట్రస్‌పై ఒత్తిడి మరింత పెరిగింది.   

Also read: YouGov Gallup Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సునాక్‌దే పైచేయి

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 20 Oct 2022 05:36PM

Photo Stories