Dekho Apna Desh: భారత్, నేపాల్ మధ్య శ్రీరాం–జానకి యాత్ర
Sakshi Education
సీతారాముల జన్మస్థానాలుగా భావిస్తున్న నేపాల్‌లోని జనక్ పుర్, భారత్‌లోని అయోధ్యలను కలుపుతూ.. ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యాటక రైలును నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘దేఖో అప్నా దేశ్’ పిలుపునకు అనుగుణంగా ఈ పర్యాటక రైలును ఫిబ్రవరి 17న ప్రారంభిస్తారు. ఏడు రోజుల ప్యాకేజీలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు.. మొదట అయోధ్యలో ఆగుతుంది. అక్కడ రామ జన్మభూమి, హనుమంతుడి ఆలయాల సందర్శన తర్వాత నందిగ్రాంలోని భారత్ మందిరాన్ని దర్శించుకోవచ్చు. అనంతరం బీహార్‌లోని సీతామఢీకి చేరుకొంటుంది. ఇలా పర్యటన కొనసాగుతుంది.
Also read: The Challenge: అంతరిక్షంలో సినిమా షూటింగ్
Published date : 23 Jan 2023 03:56PM