Skip to main content

learning French: ఫ్రెంచ్‌ నేర్చుకునేందుకు ప్రత్యేక ప్రోగ్రామ్‌

భారత విద్యార్థులు ఫ్రెంచ్‌ భాష నేర్చుకొనేందుకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ‘‘క్లాసెస్‌ ఇంటర్నేషనలేస్‌’’అనే ప్రత్యేక ప్రోగ్రామ్‌ని ప్రారంభించారు.
Language education   PM Modi and President Macron special program for learning French   Global education partnership

దీని ద్వారా ఏడాదిపాటు ఫ్రాన్స్‌­లో ఉండి ఫ్రెంచ్‌ నేర్చుకోవచ్చు. అనంతరం తమ­కు నచ్చిన డిగ్రీలో చేరవచ్చు. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ప్రోగ్రామ్‌ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఫ్రాన్స్‌ ఎంబసీ జనవరి 31న ఒక ప్రకటనలో వెల్లడించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మెక్రాన్‌ ల సంయుక్త ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత విద్యార్థులకు ఫ్రాన్స్‌లో మరిన్ని విద్యావకాశాలు కల్పించాలన్న మెక్రాన్‌ సూచనకు అనుగుణంగా ఈ ప్రోగ్రామ్‌ని ప్రారంభించారు. 5 ఏళ్ల షెంజెన్‌ వీసా వంటి వాటి ద్వారా ప్రస్తుతం ఫ్రాన్స్‌లో స్కాలర్‌షిప్‌లు పొందుతున్నవారిలో ఎక్కువ మంది భారత విద్యార్థులేనని ఫ్రాన్స్‌ ఎంబసీ తెలిపింది. 2030 నాటికి 30,000 మంది భారత విద్యార్థులను ఫ్రెంచ్‌ విద్యాసంస్థల్లో చేర్చుకోవాలని మెక్రాన్‌ సూచించారని వెల్లడించింది.

చదవండి: Elon Musk: మనిషి మెదడులో బ్రెయిన్‌ చిప్‌

Published date : 06 Feb 2024 11:09AM

Photo Stories