SpaceX Starship: స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలం
Sakshi Education
స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది.
ప్రయోగించిన కొద్దిసేపటికే అంతరిక్షంలో పేలిపోయింది. అమెరికాకు చెందిన అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ శనివారం టెక్సాస్ నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. ఎనిమిది నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పైభాగం బూస్టర్ నుంచి విజయవంతంగా వేరుపడింది.
Igla-S Anti-Aircraft Missile: రష్యా నుంచి భారత్‌కు శక్తివంతమైన క్షిపణి వ్యవస్థ
అనంతరం భూమితో సంబంధాలు తెగిపోయాయి. ప్రత్యక్ష ప్రసారం నిలిచిపోయింది. కొద్దిక్షణాల్లోనే అది పేలిపోయింది. ఇంధనంతో కలిపి ఈ భారీ స్టార్ షిప్ మొత్తం బరువు 5 వేల టన్నులు కాగా వ్యాసం 9 మీటర్లు, ఎత్తు 121 మీటర్లు. ఇదే సంస్థ ఏప్రిల్‌లో మొదటి ప్రయోగం చేపట్టింది. నాలుగు నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం రాకెట్ పేలిపోయింది.
World Climate Summit: వాతావరణ మార్పులతో మొత్తం మానవాళికే సమస్య!
Published date : 22 Nov 2023 10:22AM