Terrorism: తబ్లిగీ జమాత్‌పై నిషేధం విధించిన దేశం?
సున్నీ ఇస్లాం సంస్థ తబ్లిగీ జమాత్‌ను తమ దేశంలో నిషేధిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంస్థ ఉగ్రవాద ద్వారాల్లో ఒకటని విమర్శించింది. ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా ఉగ్రవాదానికి మార్గంగా మారిందని, సమాజానికి ప్రమాదకారిగా మారిందని పేర్కొంది. ద తబ్లిగి, దవా గ్రూప్ వంటి వాటితో ప్రజలు సంబంధం పెట్టుకోకుండా నిషేధం విధిస్తున్నట్లు డిసెంబర్ 10న తెలిపింది. వచ్చే శుక్రవారం జరిపే ప్రార్థనల్లో తబ్లిగీపై నిషేధం గురించి ప్రజలను హెచ్చరించాలని మసీదుల్లో ప్రార్థనలు చేసే ముల్లాలను ఆదేశించింది.
ఏమిటీ సంస్థ?
బ్రిటిష్ ఇండియాలో 1926లో తబ్లిగీ జమాత్ సంస్థను మౌలానా మహ్మద్ కాందల్వి స్థాపించారు. ముస్లింలు ఇస్లాం ఆచార వ్యవహారాలను కట్టుదిట్టంగా పాటించేందుకు సంస్థ కృషి చేసేది. ఈ సంస్థకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 35–40 కోట్లమంది సభ్యులున్నట్లు అంచనా. తాము కేవలం మతానికే పరిమితమని, రాజకీయ కార్యకలాపాలకు దూరమని సభ్యులు చెబుతుంటారు. అయితే యూకే, ఫ్రాన్స్, అమెరికాల్లో జరిగిన ఉగ్రకార్యకలాపాల దర్యాప్తుల్లో ఈ సంస్థ పేరు వినిపించిందని యూఎస్‌ఐఓపీ(యూనైటెడ్‌స్టేట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్) తెలిపింది.
చదవండి: ఉక్రెయిన్ రాజధాని నగరం పేరు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సున్నీ ఇస్లాం సంస్థ తబ్లిగీ జమాత్‌పై నిషేధం విధించిన దేశం?
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : సౌదీ అరేబియా
ఎక్కడ : సౌదీ అరేబియా
ఎందుకు : ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా ఉగ్రవాదానికి మార్గంగా మారిందని, సమాజానికి ప్రమాదకారిగా మారిందని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్