Skip to main content

Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల విధ్వంసం

ఉక్రెయిన్‌పై డిసెంబ‌ర్ 16న 60 రష్యా క్షిపణులు నాలుగు నగరాల్లో విధ్వంసం సృష్టించాయి.

రాజధాని కీవ్‌తోపాటు, ఖర్కీవ్‌లో విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు ప్రాణభయంతో భూగర్భ సబ్‌వే స్టేషన్లలో తలదాచుకున్నారు. రష్యా దురాక్రమణ మొదలయ్యాక రాజధానిపై జరిగిన రాకెట్‌ దాడుల్లో ఇదొకటని అధికారులు చెప్పారు. రాజధాని గగన తలంలోకి ప్రవేశించిన సుమారు 40 క్షిపణుల్లో 37 క్షిపణులను కూల్చివేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. కీవ్‌ టెరిటోరియల్‌ మొబైల్‌ ఆర్మీ మెషీన్‌ గన్‌తో క్రూయిజ్‌ క్షిపణిని కూల్చివేయడం అసాధారణం, నమ్మలేని నిజమని కమాండర్‌ ఒకరు పేర్కొన్నారు. అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంతూరైన క్రివ్విరిహ్‌లోని నాలుగంతస్తుల అపార్టుమెంట్‌పై ఒక క్షిపణి పడింది. పేలుళ్లతో ఇద్దరు చనిపోయారని అధికారులు తెలిపారు. జపొరిజియాపై 15 క్షిపణులు పడ్డాయి. దాడులతో ఖర్కీ వ్, డొనెట్‌స్క్‌ తదితర ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లకు కరెంటు నిలిచిపోయింది.

Ukraine war: రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో భారీ ప్రాణనష్టం

Published date : 17 Dec 2022 04:03PM

Photo Stories