Russia-UKraine War: రష్యా బృందంతో చర్చలకు ఉక్రెయిన్ అంగీకారం
రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభ నివారణకు రష్యా బృందంతో చర్చలకు సిద్ధమని ఫిబ్రవరి 27న ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోకి రష్యా సేనలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు పక్షాలు బెలారస్ దేశ సరిహద్దులో ఏదో ఒక ప్రాంతంలో చర్చలు జరుపుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయం తెలిపింది. ఏ సమయంలో చర్చలు జరిగేది వెల్లడించలేదు. అంతకుముందు చర్చలకు బెలారస్‌లోని గోమెల్ నగరానికి తమ బృందం వెళ్లిందని రష్యా తెలిపింది. నాటోలో చేరకపోవడం సహా కీలక డిమాండ్లపై చర్చలకు సిద్ధమని జెలెన్‌స్కీ ఫిబ్రవరి 25న ప్రకటించిన నేపథ్యంలో రష్యా ఈ బృందాన్ని పంపింది.
ఐరాస అత్యవసర భేటీ!
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణపై చర్చకు 193 మంది సభ్యులతో కూడిన ఐరాస సాధారణ అసెంబ్లీ ‘అరుదైన అత్యవసర ప్రత్యేక సమావేశం’ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భేటీ కోసం భద్రతా మండలిలో ఓటింగ్ జరగనుంది. భద్రతామండలి ‘‘పూర్తి సమావేశం’’లో శాశ్వత దేశాలు వీటో అధికారం ఉపయోగించే వీలు లేదు. దాడిపై భద్రతా మండలి తీర్మానాన్ని ఫిబ్రవరి 25న రష్యా వీటో చేయడం తెలిసిందే.
SWIFT Payment System: స్విఫ్ట్ వ్యవస్థ నుంచి ఏ దేశాన్ని బహిష్కరించారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్