Skip to main content

Russia-Ukraine War: సముద్రంలో మునిగిపోయిన ప్రఖ్యాత యుద్ద నౌక?

Moskov

ఉక్రెయిన్‌ దాడిలో ఏప్రిల్‌ 14న భారీగా దెబ్బతిన్న రష్యా ప్రఖ్యాత యుద్ద నౌక మాస్క్‌వా చివరకు నల్ల సముద్రంలో మునిగిపోయింది. దెబ్బతిన్న నౌకను దగ్గరలోని నౌకాశ్రయానికి తరలిస్తుండగా మధ్యలోనే మునిగిపోయినట్లు ఏప్రిల్‌ 15న రష్యా ప్రకటించింది. ఇకపై ఉక్రెయిన్‌ రాజధానిపై మరిన్ని మిసైల్‌ దాడులు జరుపుతామని ప్రకటించింది. రష్యా సరిహద్దు భూభాగంపై ఉక్రెయిన్‌ జరుపుతున్న మిలటరీ దాడులకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నామని రష్యా రక్షణశాఖ ప్రకటించింది.

మాస్క్‌వాకు అణు వార్‌హెడ్‌

  • నల్ల సముద్రంలో మునిగిన రష్యా యుద్ధ నౌక మాస్క్‌వాపై రెండు అణు వార్‌ హెడ్స్‌ అమర్చి ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మునిగిన ప్రాంతంలో పర్యావరణ ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బ్రోక్‌ యారో ఘటన ( ఒక ప్రమాదంలో అణ్వాయుధాలుండడం)ను తేలిగ్గా తీసుకోకూడదన్నారు.
  • మాస్క్‌వా మునకకు అగ్ని ప్రమాదమే కారణమని రష్యా పేర్కొంది. అయితే తమ మిసైల్‌ దాడి వల్లనే నౌక మునిగిందని ఉక్రెయిన్‌ అధికారులు చెప్పారు. వీరి వాదన నిజమైతే ఇటీవల కాలంలో ఒక యుద్ధంలో మునిగిన అతిపెద్ద నౌక మాస్క్‌వా కానుంది.

United Nations: ప్రపంచవ్యాప్తంగా ఏటా వృథా అవుతున్న ఆహారం విలువ?

మాస్క్‌వా మిస్సైల్‌ క్రూయిజర్‌ ప్రత్యేకతలు

  • రష్యా నేవీలో ఉన్న మూడు అట్లాంటా క్లాస్‌ గైడెడ్‌ మిస్సైల్‌ క్రూయిజర్లలో ఇది ఒకటి  
  • సిబ్బంది సంఖ్య: 680 
  • పొడవు: 186 మీటర్లు  
  • గరిష్ట వేగం: 32 నాటికల్‌ మైళ్లు(59 కి.మీ.)

ఆయుధ సంపత్తి

  • 16 యాంటీ షిప్‌ వుల్కన్‌ క్రూయిజ్‌ మిస్సైళ్లు 
  • ఎస్‌–300 లాంగ్‌ రేంజ్‌ మెరైన్‌ వెర్షన్‌ మిస్సైళ్లు 
  • షార్ట్‌ రేంజ్‌ ఒస్సా మిస్సైళ్లు 
  • రాకెట్‌ లాంచర్స్, గన్స్, టార్పెడోస్‌

20 వేల రష్యా సైనికులు మృతి?
ఇప్పటిదాకా ఏకంగా 20 వేల మంది రష్యా సైనికులను చంపినట్టు ఉక్రెయిన్‌ తాజాగా ప్రకటించింది. 160కి పైగా యుద్ధ విమానాలు, 200 హెలికాప్టర్లు, 800 ట్యాంకులు, 1,500కు పైగా సాయుధ వాహనాలు, 10 నౌకను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. 2,000కు పైగా ఉక్రెయిన్‌ యుద్ధ ట్యాంకులను తాము నాశనం చేశామని రష్యా తెలిపింది. నాటోలో చేరితే తీవ్ర పర్యవసానాలు తప్పవని ఫిన్లాండ్, స్వీడన్‌లను తీవ్రంగా హెచ్చరించింది.

United Nations: ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
సముద్రంలో మునిగిపోయిన ప్రఖ్యాత యుద్ద నౌక?
ఎప్పుడు : ఏప్రిల్‌ 15
ఎవరు    : మాస్క్‌వా మిస్సైల్‌ క్రూయిజర్‌
ఎక్కడ    : నల్ల సముద్రం
ఎందుకు : ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 Apr 2022 01:06PM

Photo Stories