Skip to main content

Russia-Ukraine Crisis: బెలారస్‌తో కలిసి సైనిక విన్యాసాలు చేపట్టిన దేశం?

Ukraine border
తూర్పు ఉక్రెయిన్‌లో తుపాకీ తూటాల దెబ్బకు శిథిలమైన గోడ ముందు సైనికుడు

యూరప్‌లో యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి. సైన్యానికి, రష్యా అనుకూల రెబెల్స్‌కు మధ్య నానాటికీ పెరుగుతున్న కాల్పుల మోతతో తూర్పు ఉక్రెయిన్‌ సరిహద్దులు దద్దరిల్లుతున్నాయి. దాంతో రెబల్స్‌ ఆక్రమిత ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు రష్యా బాట పడుతున్నారు. ఉక్రెయిన్‌కు మూడువైపులా రష్యా సైనిక మోహరింపులు రెండు లక్షలకు చేరాయన్న వార్తలు యూరప్‌ దేశాలను మరింత ఆందోళన పరుస్తున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీనాటి అణు, సంప్రదాయ సైనిక విన్యాసాలకు కొనసాగింపుగా నల్లసముద్ర తీరంలో రష్యా జోరుగా నావికా విన్యాసాలకు కూడా దిగింది. బెలారస్‌తో ఫిబ్రవరి 20న ముగియాల్సిన సంయుక్త సైనిక విన్యాసాలు మరికొద్ది రోజులు కొనసాగుతాయని ప్రకటించి ఉద్రిక్తతలను మరింత పెంచింది. విన్యాసాలను పొడిగించినట్టే ఏదో సాకుతో రష్యా యుద్ధానికీ దిగుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఆరోపించారు.

రష్యా–ఉక్రెయిన్‌ బలాబలాలు

రష్యా, ఉక్రెయిన్‌ మిలటరీ బలాబలాలను చూస్తే ఎక్కడా పొంతన కుదరదు. రష్యా మిలటరీని ఉక్రెయిన్‌ నామమాత్రంగా కూడా ఢీ  కొనలేదు. అయినప్పటికీ అమెరికా, బ్రిటన్‌ అండదండలతో ఆ దేశం ధీమాగా ఉంది. అగ్రరాజ్యాలు తమ రక్షణ కోసం నాటో బలగాల్ని తరలిస్తారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ ఆశతో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 12 దేశాలు సభ్యులుగా మొదలైన నాటోలో ప్రస్తుతం 30 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, డెన్మార్క్‌ వంటి దేశాలతో కూడిన నాటో బలగాలు ఉక్రెయిన్‌కి అండగా నిలిస్తే ఇరు పక్షాల మధ్య భీకర పోరు జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలటరీ ఉన్న దేశాల్లో రష్యా అయిదో స్థానంలో ఉంది.

Russia-Ukraine

చ‌ద‌వండి: అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 21 Feb 2022 05:26PM

Photo Stories