Russia: ఉక్రెయిన్ నుంచి ఎగుమతి ఒప్పందం రద్దు చేస్తాం
Sakshi Education
కీవ్: ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతికి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేయబోతున్నట్లు రష్యా రక్షణ శాఖ అక్టోబర్ 29న ప్రకటించింది.
Russia suspends grain export deal with Ukraine
రష్యా దండయాత్ర ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ నుంచి ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాల ఎగుమతి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో ఉక్రెయిన్ నుంచి ఎగుమతులకు రష్యా అంగీకరించింది. ఈ మేరకు ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద ఉక్రెయిన్ 9 మిలియన్ టన్నులకుపైగా ఆహార ధాన్యాలను విదేశాలకు ఎగుమతి చేసింది. దీనివల్ల పలు దేశాల్లో ఆహారం ధరలు దిగివచ్చాయి. ఉక్రెయిన్‌పై ప్రతీకారంగానే ఎగుమతుల ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు మళ్లీ ఆగిపోవడం ఖాయం.