Pakistani Boat: రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడిన పాకిస్థాన్ బోటు
Sakshi Education
ఆయుధాలు, మందుగుండు సామగ్రితోపాటు రూ.300 కోట్ల విలువైన 40 కిలోల డ్రగ్స్, 10 మందితో గుజరాత్ తీరంవెంట భారత జలాల్లోకి ప్రవేశించిన పాక్ పడవను భారత తీర రక్షక దళం పట్టుకుంది.
డిసెంబర్ 25న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. అందులోని పదిమందిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ నిమిత్తం ఓఖా పోర్టుకు తరలించారు. ఉగ్రవాద వ్యతిరేక బృందం (ATS) ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఇండియన్ కోస్ట్ గార్డ్ డిసెంబరు 25-26 రాత్రి నోషనల్ అంతర్జాతీయ మారిటైమ్ బోర్డర్ లైన్ (IMBL) వద్ద ఫాస్ట్ పెట్రోల్ క్లాస్ షిప్ ఐసీజీఎస్ (ICGS) అరింజయ్‌తో గస్తీ కాసి పట్టుకుంది.
కశ్మీర్‌లో భారీ ఆయుధ డంప్
జమ్మూకశ్మీర్‌లో సరిహద్దులకు సమీపంలోని ఉడిలో భారీగా ఆయుధ డంప్ బయటపడింది. ఇందులో 24 ఏకే–74 రైఫిళ్లు, 12 చైనీస్ పిస్టళ్లు, చైనీస్ హ్యాండ్ గ్రెనేడ్లు, 5 పాక్ తయారీ హ్యాండ్ గ్రెనేడ్లు, ఐ లవ్ పాకిస్తాన్ అని రాసి ఉన్న 81 బెలూన్లు భారీగా మందు గుండు సామగ్రి ఉన్నాయి. వీటిని తీవ్రవాదులకు అందించేందుకు దొంగచాటుగా పాక్ తరలించిందని అధికారులు
తెలిపారు.
Published date : 27 Dec 2022 03:08PM