PTI Chief: ఇమ్రాన్ ఖాన్‌ను తొలగింపు ప్రక్రియ షురూ!
Sakshi Education
పాకిస్తాన్ తెహ్రాక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్ష పదవి నుంచి మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను తొలగించే ప్రక్రియను పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రారంభించింది.
తోషఖానా కేసులో ఇమ్రాన్‌పై ఇప్పటికే అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయనను పక్కనపెట్టేందుకు ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇమ్రాన్‌కు డిసెంబర్ 6న నోటీసు జారీ చేసింది. డిసెంబర్ 13న ఆయన వివరణను ఎన్నికల సంఘం తెలుసుకోనుంది. ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశ విదేశాల్లో స్వీకరించిన ఖరీదైన వస్తువులను, కానుకలను నిబంధనల ప్రకారం తోషఖానాకు తరలించారు. అవే వస్తువులను తోషఖానా నుంచి తక్కువ ధరకు కొనేసి, ఎక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లు ఇమ్రాన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.
ISIS: ఐసిస్ చీఫ్ హతం.. కొత్త సారథిని ప్రకటించిన ఉగ్రసంస్థ
Published date : 07 Dec 2022 01:29PM