Nuclear Weapons : అమెరికాకి ఉత్తరకొరియా హెచ్చరిక
1950–53 కొరియా యుద్ధానికి 69 ఏళ్లవుతున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ సైనికులనుద్దేశించి ప్రసంగించారు. ‘ఎలాంటి సంక్షోభం తలెత్తినా దీటుగా స్పందించేందుకు మా సైనిక బలగాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయి. అణ్వాయుధాలను సైతం కచ్చితంగా, వేగంగా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నట్లు అధికార కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కిమ్ హెచ్చరికలతో కొరియా ద్వీపకల్పంపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయంది. అమెరికా తన విధానాలను సమర్థించుకోవడానికి ఉత్తరకొరియాను దుష్ట దేశంగా చిత్రీకరిస్తోందని కిమ్ ఆరోపించారు. దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాలు చేపట్టడం అమెరికా ద్వంద్వ ప్రమాణాలకు, గ్యాంగ్‌స్టర్ వైఖరికి నిదర్శనమన్నారు. అమెరికా రెచ్చగొట్టే, బెదిరింపు చర్యల వల్లే తాము అణు పరీక్షలు జరపాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు అంటున్నారు.
Also read: INS Vikrant : ఆగస్టు 15న విధుల్లోకి
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP