Skip to main content

Niagara Falls: గడ్డకట్టిన నయాగరా అందాలు..!

ప్రపంచంలోనే చూడదగ్గ ప్రదేశాల్లో అమెరికా-కెనడా దేశాల మధ్య నయాగరా నదిపై ఉన్న నయాగరా ఫాల్స్ ఒక‌టి.

అంతటి ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం ప్రస్తుతం గడ్డకట్టుకుపోయింది. అక్క‌డ‌ ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీల దాకా పడిపోవడంతో అందాల జలపాతం కాస్తా మంచు కొండగా మారిపోయింది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తుండ‌టంతో ఎటుచూసినా మంచు గడ్డలే కనిపిస్తున్నాయి. వాటర్ ఫాల్స్ దగ్గర ఆర్కిటిక్ వాతావరణం నెలకొంది. జలపాతం గడ్డకట్టిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. నీటి ప్రవాహం మొత్తం గడ్డకట్టి వింటర్ వండర్ ల్యాండ్‌ను తలపిస్తోంది.

US Bomb Cyclone: మంచు గుప్పెట్లో అమెరికా.. మైనస్‌ 30కి ఉష్ణోగ్రతలు
ఏటా శీతాకాలంలో జలపాతం తాత్కాలికంగా మంచుముద్దగా మారిపోతుందని, ఈ ఏడాది తుపాన్ ప్రభావంతో కాస్తా ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. శీతాకాలంలో జలపాతం గడ్డకట్టి టెంపరరీ బ్రిడ్జిగా మారేదని తెలిపారు. ఆ సమయంలో పర్యాటకులు మంచుపై నడుస్తూ నదిని దాటే వీలుండేదన్నారు. అయితే, 1912లో ఇలా నది దాటుతుండగా మంచు పెళ్లలు విరిగి ముగ్గురు టూరిస్టులు నదిలోపల పడిపోయారని చెప్పారు. అప్పటి నుంచి జలపాతంపై నడవడాన్ని ప్రభుత్వం నిషేధించిందని వివరించారు.

 

Published date : 29 Dec 2022 04:52PM

Photo Stories