Skip to main content

England and Wales: ఇంగ్లండ్‌లో అమల్లోకి బాల్య వివాహాల నిరోధక చట్టం

బాలికలకు చట్టబద్ధ వివాహ వయసును 18 ఏళ్లకు పెంచుతున్న చట్టం ఇంగ్లండ్, వేల్స్‌లలో అమల్లోకి వచ్చింది.
Child Marriage Act

ఇందుకు సంబంధించిన సరికొత్త వివాహ, పౌర భాగస్వామ్య(కనీస వయసు) చట్టం గత ఏప్రిల్‌లోనే రాజామోదం పొందింది. 

బ్రిటన్‌ లోని స్కాట్లండ్, ఉత్తర ఐర్లండ్‌ ప్రాంతాలు కూడా త్వరలోనే ఈ చట్టానికి ఆమోద ముద్ర వేస్తాయని శాసనకర్తలు భావిస్తున్నారు. బ్రిటన్‌ లో దక్షిణాసియా, ఆఫ్రికా సంతతికి చెందిన కొన్ని వర్గాల ప్రజల్లో బాలికలకు 16 లేదా 17 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసే సంప్రదాయం ఉంది. దీన్ని నిషేధించే చట్టాలేవీ ఇంతవరకు లేవు. ఇకనుంచి 18 ఏళ్లు రాకుండానే బాలికలకు వివాహం చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి కొత్త చట్టం వీలు కల్పిస్తోంది.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 10 Mar 2023 04:58PM

Photo Stories