Skip to main content

జూన్ 2021 అంతర్జాతీయం

మూడో సంతానాన్ని కనేందుకు అనుమతిచ్చిన దేశం?
Current Affairs దేశంలో జననాల రేటు పడితుండటంతో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దంపతులు ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండేందుకు వీలు కల్పిస్తున్నట్లు మే 31న ప్రకటించింది. ఒకే సంతానం విధానాన్ని దశాబ్దాలపాటు కఠినంగా అమలు చేయడంలో చైనాలో జనాభా పెరుగుదల క్షీణించింది. దీని కారణంగా తలెత్తే దుష్ఫలితాలపై ఆందోళనలు వెల్లువెత్తడంతో ఇద్దరు బిడ్డల్ని కనవచ్చంటూ 2016లో వెసులుబాటు కల్పించింది. తాజాగా, మరో అడుగు ముందుకేసి దంపతులు ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండేందుకు వీలు కల్పించింది.
కొత్త గణాంకాల ప్రకారం.. చైనాలో వరుసగా నాలుగో ఏడాది కూడా జననాల రేటు అతితక్కువగా నమోదైంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా, రెండోఅతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనాలో పనిచేయగలిగే వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుండటంపై ప్రభుత్వ వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో, దేశాధ్యక్షుడు, కమ్యూనిస్ట్‌ పార్టీ(సీపీసీ) అధినేత జిన్‌పింగ్‌..ఇప్పటి వరకు అనుసరించిన కుటుంబ నియంత్రణ విధానాన్ని పక్కనబెట్టి, దంపతులు మూడో బిడ్డను కూడా కలిగి ఉండేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మూడో సంతానాన్ని కనేందుకు అనుమతిచ్చిన దేశం?
ఎప్పుడు : మే 31
ఎవరు : చైనా
ఎందుకు : దేశంలో జననాల రేటు పడితుండటంతో...

సినోవాక్ టీకాకు డబ్ల్యూహెచ్ అత్యవసర అనుమతి
చైనాకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ సినోవాక్‌ తయారుచేసిన సినోవాక్‌ కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) జూన్ 1న అత్యవసర అనుమతులిచ్చింది. చైనా నుంచి ఇప్పటికే సైనోఫార్మ్‌ వ్యాక్సిన్‌ డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ అనుమతులు పొందిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సిన్ల లోటు ఏర్పడిన తరుణంలో మరిన్ని వ్యాక్సిన్లు ఉండటం అత్యవసరమని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. కోవ్యాక్స్‌ ఫెసిలిటీ ద్వారా ప్రపంచంలోని పేద దేశాలకు వ్యాక్సిన్లను అందించాల్సిందిగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలను కోరింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చైనాకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ సినోవాక్‌ తయారుచేసిన సినోవాక్‌ కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించేందుకు అత్యవసర అనుమతి
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)
ఎందుకు : కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు...

నీట మునిగిన ఇరాన్ అతిపెద్ద యుద్ధనౌక?
ఇరాన్‌ నావికా దళానికి చెందిన అతిపెద్ద యుద్ధ నౌక ‘ఖర్గ్‌’ కథ ముగిసింది. గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో విధి నిర్వహణలో ఉన్న ఈ నౌకలో మే 2న మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. చివరకు ఖర్గ్‌ నీట మునిగింది. ఈ యుద్ధ నౌక పొడవు 207 మీటర్లు (679 అడుగులు). సముద్రంలో ఇతర నౌకలను అవసరమైన సామగ్రిని సరఫరా చేయడానికి, శిక్షణ కోసం ఈ నౌకను ఉపయోగిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు నౌకపై 400 మంది సిబ్బంది ఉన్నారని, వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 1,270 కిలోమీటర్ల దూరంలో హర్మూజ్‌ జలసంధికి సమీపంలో జాస్క్‌ పోర్టు వద్ద ఖర్గ్‌ నీటిలో మునిగిపోయింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీట మునిగిన ఇరాన్‌ అతిపెద్ద యుద్ధనౌక?
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : ఖర్గ్‌
ఎక్కడ : గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌
ఎందుకు : మంటలు చెలరేగిన కారణంగా...
Published date : 03 Jul 2021 01:17PM

Photo Stories