Skip to main content

Visa Free: ఈ దేశాలకు వెళ్లాలంటే భారతీయులకు వీసా అవ‌స‌రం లేదు.. షరతులు ఇవే..!

ప్రపంచంలోని కొన్ని దేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి, మరికొన్ని దేశాలు వీసా లేకుండా.. షరతులతో అనుమతి కల్పిస్తాయి.

ఈ జాబితాలో ఇప్పుడు ఇరాన్ చేరింది. ఇరాన్ వెళ్లాలనుకునే భారతీయులకు ఇది శుభవార్త. భారతీయులకు వీసా మినహాయింపు కల్పించిన దేశాల వరుసలో ఇరాన్ చేరింది. దీంతో వీసా అవసరం లేకుండా 15 రోజులు ఇరాన్ దేశంలో పర్యటించడానికి ఢిల్లీలోని ఇరాన్ రాయభారి కార్యాలయం ఇటీవలే ప్రకటించింది. భారతదేశానికి మాత్రమే కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, మలేషియాతో సహా 32 ఇతర దేశాల కోసం వీసా-ఫ్రీ ప్రోగ్రామ్‌ను ఆమోదించింది. 

ఇరాన్ దేశంలో పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేయడానికి వీసా ఫ్రీ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు ఇరాన్ పర్యాటక మంత్రి 'ఇజ్జతుల్లా జర్గామి' (Ezzatollah Zarghami) వెల్లడించారు. దీని ద్వారా ప్రపంచంలోని చాలా దేశాల సందర్శకులు ఇరాన్ సందర్శిస్తారని, తద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా ఆశాజనకంగా ఉంటుందని తెలిపారు.

వీసా లేకుండా ఇరాన్ వెళ్లాలనుకునే వారికి షరతులు..
► సాధారణ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న వ్యక్తులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీసా లేకుండా ఇరాన్‌లోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. వీరు కేవలం 15 రోజులు మాత్రమే ఇరాన్ దేశంలో పర్యటించడానికి అర్హులు.
► వీసా ఫ్రీ అనేది కేవలం పర్యాటక ప్రయోజనాల కోసం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌లోకి ప్రవేశించే వ్యక్తులకు మాత్రమే ప్రత్యేకంగా వర్తిస్తుంది.
► భారతీయులు 15 రోజుల కంటే ఎక్కువ కాలం ఇరాన్ దేశంలో పర్యటించాలనుకుంటే.. తప్పకుండా భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం నుంచి ప్రత్యేక వీసాలు పొందాల్సి ఉంటుంది.
► ఎయిర్ బోర్డర్ ఎంట్రీ అనేది వైమానిక సరిహద్దు ద్వారా దేశంలోకి ప్రవేశించే భారతీయ పౌరులకు ప్రత్యేకం. 

David Marjot: చ‌దువుకు వ‌య‌సుతో సంబంధం లేదు.. 95 ఏళ్లలో డిగ్రీ పట్టా.. ఎవ‌రికంటే..!

Published date : 07 Feb 2024 04:53PM

Photo Stories