Skip to main content

Maldives: మాల్దీవుల ప‌ర్యాట‌కుల జాబితాలో 5వ స్థానానికి చేరిన భార‌త్‌..!

భారత్‌ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది.
Top tourist sources for Maldives   Decline in Indian tourists to Maldives  Maldives sees massive drop in Indian tourists in first 3 weeks of January

దీనికి కారణం ఇరుదేశాల మధ్య ఏర్పడిన విభేదాలే. గతేడాది డిసెంబరు 31 వరకు భారత్‌ నుంచి 2,09,198 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. దీంతో మాల్దీవుల పర్యాటక మార్కెట్‌లో 11 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా రెండో స్థానంలో, చైనా మూడో స్థానంలో కొనసాగాయి. నాలుగో స్థానంలో బ్రిటన్‌ నిలిచింది. 

కానీ భారత్‌ 5వ స్థానానికి పరిమితమైంది. మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి 28వ తేదీ నాటికి   మాలీవులను అత్యధికంగా సందర్శించిన పర్యాటకుల సంఖ్య పరంగా రష్యా(18,561 మంది) తొలి స్థానానికి చేరింది. తర్వాతి స్థానాల్లో ఇటలీ, చైనా, బ్రిటన్‌, భారత్‌(13,989) నిలిచాయి.

India-Maldives Controversy: దారితప్పిన మాల్దీవులు.. కార‌ణం ఏమిటంటే..

Published date : 02 Feb 2024 11:04AM

Photo Stories