Skip to main content

JIMEX 2022: భారత్‌-జపాన్‌ సంయుక్త నావికాదళ విన్యాసాలు

india, japan naval exercise jimex 2022

బంగాళాఖాతంలో విశాఖపట్నం తీరాన జపాన్‌ , భారత్‌ దేశాల నౌకాదళ విన్యాసాలు ముగిసాయి. ఈ మారిటైం ద్వైపాక్షిక విన్యాసాలకు భారత నౌకాదళం సారథ్యం వహించింది. జపాన్‌ స్వీయ రక్షణ దళం(జేఎంఎస్‌డీఎఫ్‌) నౌకలు ఇజుమో, తకనమీలు.. భారత నేవీకి చెందిన ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి, కద్మత్, కవరత్తి.. ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. జిమెక్స్‌-2022 విన్యాసాలను విశాఖలోని హార్బర్, సముద్ర ఫేజ్‌లలో నిర్వహించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా 2012 నుంచీ ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. 6వ ఎడిషన్‌ ఈ సంవత్సరం విజయవంతంగా ముగిసినట్లు భారత నేవీ తెలిపింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 23 Sep 2022 04:59PM

Photo Stories