India & China buying Russian Oil: 3 నెలల్లో 24 బిలియన్ డాలర్ల చమురు
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన మూడు నెలల్లో భారత్, చైనాలు కలిసి మొత్తం 24 బిలియన్ డాలర్ల విలువైన రష్యా చమురును కొనుగోలు చేశాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య హెచ్చరికలను పట్టించుకోకుండా.. ఈ కొనుగోళ్లు జరిగాయి. మేతో ముగిసే మూడు నెలలకు చైనా మొత్తం 18.9 బిలియన్ డాలర్ల విలువైన రష్యా చమురును కొనుగోలు చేయగా.. అదే సమయంలో భారత్ 5.1 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకొంది. గతేడాదితో పోలిస్తే ఇది ఐదు రెట్లు అధికం. అమెరికా,ఇతర ఐరోపా దేశాలు రష్యా నుంచి కొనుగోళ్లు నిలిపివేయడంతో.. ఆ లోటును భర్తీ చేయడానికి భారత్, చైనా కొనుగోళ్లు ఉపయోగపడ్డాయి. రష్యాకు భారత్, చైనాతో దీర్ఘకాలంగా వ్యూహాత్మక అనుబంధం ఉండటంతో భారీ డిస్కౌంట్లను ఆఫర్‌చేసింది. అదే సమయంలో స్థానిక కరెన్సీల్లో కూడా చెల్లింపులను అంగీకరించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP