Free Trade Agreement: బ్రిటన్ –భారత్ పరిశ్రమల టాస్క్‌ఫోర్స్
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) సాకారం అయ్యే దిశగా పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింతగా పెంపొందించుకునే ఉద్దేశంతో భారత్, బ్రిటన్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్రిటీష్ ఇండస్ట్రీ(సీబీఐ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) కలిసి ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాయి. ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చే విధంగా ఎఫ్‌టీఏను తీర్చిదిద్దేందుకు అవసరమైన అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా ఉంటుందని సీబీఐ ప్రెసిడెంట్ లార్డ్ కరణ్ బిలిమోరియా తెలిపారు. ఎఫ్‌టీఏ సాకారమైతే.. 2035నాటికి బ్రిటన్, భారత్ మధ్య వాణిజ్యం 28 బిలియన్ పౌండ్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఇది 23 బిలియన్ పౌండ్ల స్థాయిలో ఉంది.
డబ్ల్యూఈఎఫ్ టెక్‌లో 5 భారతీయ స్టార్టప్‌లు
వరల్డ్ ఎకనమిక్ ఫోరానికి(డబ్ల్యూఈఎఫ్) సంబంధించిన టెక్నాలజీ పయోనీర్స్ కమ్యూనిటీలో.. ఈ ఏడాది కొత్తగా 100 స్టార్టప్‌లు చేరాయి. వీటిలో భారత్‌కు చెందిన ఐదు అంకుర సంస్థలు కూడా ఉన్నాయి. వాహన్, స్మార్ట్‌కాయిన్ ఫైనాన్షియల్స్, రీసైకల్, ప్రోయియాన్, ప్యాండోకార్ప్.. ఈ జాబితాలో ఉన్నట్లు డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది. ఎంపికైన స్టార్టప్‌లకు డబ్ల్యూఈఎఫ్ వర్క్‌షాప్‌లు, కార్యక్రమాలు, అత్యున్నత స్థాయి చర్చలు మొదలైన వాటిలో పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. ఎయిర్‌బీఎన్ బీ, గూగుల్, కిక్‌స్టార్టర్, మొజిల్లా, స్పాటిఫై వంటి కంపెనీల సరసన ఇవి కూడా చేరతాయి. మే 22–26 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సు జరగనున్న నేపథ్యంలో.. ఈ లిస్టును ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. టెక్ పయోనీర్స్ జాబితాలో మొత్తం 30 దేశాలకు చెందిన స్టార్టప్‌లు ఉన్నాయి.
India-Nordic Summit 2022: ఇండియా–నార్డిక్ రెండో శిఖరాగ్ర సదస్సును ఎక్కడ నిర్వహించారు?