Skip to main content

World Health Organization: గాయాలతో ఏటా 44 లక్షల మంది మృతి

గాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా దాదాపు 44 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది.

వీరిలో ప్రతి ముగ్గురిలో ఒకరు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి, ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేసింది. ఈ మేరకు ‘గాయాల నివారణ, సంరక్షణ’ 14వ ప్రపంచ సదస్సు సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ ఒక నివేదిక విడుదల చేసింది. గాయాలు, హింస వల్ల ప్రపంచవ్యాప్తంగా నిత్యం 12,000 మంది బలైపోతున్నారని నివేదికలో వివరించింది. 5 నుంచి 29 ఏళ్ల వయసున్నవారిలో సంభవిస్తున్న మరణాలకు తొలి 5 కారణాల్లో 3 కారణాలు గాయాలకు సంబంధించినవేనని స్పష్టం చేసింది.

తెలుసుకోండి: అక్టోబ‌ర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు

జనం మృత్యువాత పడడానికి రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, నీటిలో మునిగిపోవడం, అగ్ని ప్రమాదాలు, విషం తీసుకోవడం వంటివి ప్రధానంగా కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ తేల్చిచెప్పింది. ప్రతి 6 మరణాల్లో ఒకటి ఆత్మహత్య, ప్రతి 9 మరణాల్లో ఒకటి హత్య, ప్రతి 61 మరణాల్లో ఒకటి యుద్ధం, ఘర్షణల వల్ల సంభవిస్తున్నాయని పేర్కొంది. సంపన్నులతో పోలిస్తే పేదలు గాయాల వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ గెబ్రీయెసస్‌ తెలిపారు.

NASA:చంద్రుని చెంతకు ఓరియాన్‌.. చరిత్ర సృష్టించిన నాసా మిషన్‌

Published date : 01 Dec 2022 01:30PM

Photo Stories