Skip to main content

Elizabeth II Becomes World's Second-Longest Reigning Monarch: ఎలిజబెత్‌–2 కొత్త రికార్డు

Elizabeth II Becomes World's Second-Longest Reigning Monarch
  • బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2 (96) జూన్‌  12(ఆదివారం)  కొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక కాలం పాలించిన వారి జాబితాలో థాయ్‌లాండ్‌ మాజీ పాలకుడు భూమిబల్‌ అతుల్యతేజ్‌ను వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలిచారు. భూమిబల్‌ 1927 నుంచి 2016 మధ్య 70 ఏళ్ల 126 రోజులు రాజుగా ఉన్నారు. ఆమె ఇంకో రెండేళ్లు పదవిలో కొనసాగితే ఫ్రాన్స్‌ లూయి–14ని కూడా దాటేసి తొలి స్థానంలో నిలుస్తారు.
  • లూయి–14 1643 నుంచి 1715 దాకా 72 ఏళ్ల 110 రోజులు ఫ్రాన్స్‌ను పాలించారు. ఎలిజెబెత్‌–2 1953లో సింహాసనమెక్కారు. బ్రిటన్‌ను అత్యధిక కాలం పాలించిన క్వీన్‌ విక్టోరియా రికార్డును 2015 సెప్టెంబర్‌లో అధిగమించారు. ఆమె పాలనకు 70 ఏళ్లు నిండిన సందర్భంగా వారం రోజులుగా ఇంగ్లండ్‌లో ఘనంగా వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో వాటిలో పాల్గొనలేకపోయిన రాణి ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.
  • ఈ మేరకు వారిని ఉద్దేశించి ఆదివారం ఆమె లేఖ విడుదల చేశారు. ‘‘ఒక రాణి 70 ఏళ్లు పాలిస్తే సంబరాలు చేసుకోవాలంటూ నిజానికి రూలేమీ లేదు. అయినా మీరే చొరవ తీసుకొని ఇంత భారీగా వేడుకలు జరపడం నన్ను ఆనం దోద్వేగాలకు లోనుచేసింది’’ అని పేర్కొన్నారు. 
  • Download Current Affairs PDFs Here
  • యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
    డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌
Published date : 13 Jun 2022 05:04PM

Photo Stories