Skip to main content

Alcohol Tax: మద్యంపై పన్ను రద్దు

పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా దుబాయ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాలపై ఇప్పటిదాకా విధిస్తున్న 30 శాతం పన్నును పూర్తిగా రద్దు చేసింది.

ఇది జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. అంతేకాకుండా వ్యక్తిగత ఆల్కహాల్‌ లైసెన్స్‌లకు ఇకపై ఎలాంటి చార్జీ వసూలు చేయబోరు. దుబాయ్‌లో ఎవరైనా ఇళ్లలో మద్యం సేవించాలంటే వ్యక్తిగత ఆల్కహాల్‌ లైసెన్స్‌ ఉండాల్సిందే. దుబాయ్‌ ప్రభుత్వం ఇటీవలి కాలంలో మద్యం విషయంలో కొన్ని చట్టాలను సడలిస్తోంది. అయితే, పన్ను రద్దు అనేది తాత్కాలికమా? లేక శాశ్వతమా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. 

Elon Musk: పేరుకే ప్ర‌పంచ కుబేరుడు.. ఆఫీసు అద్దె కూడా క‌ట్ట‌లేడు

Published date : 03 Jan 2023 01:17PM

Photo Stories