Chris Hipkins: న్యూజిలాండ్ నూతన ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్
Sakshi Education
క్రిస్ హిప్కిన్స్(44) న్యూజిలాండ్ నూతన ప్రధానమంత్రి కానున్నారు.
ప్రధాని జెసిండా ఆర్డెర్న్ అనూహ్యంగా రాజీనామా ప్రకటన చేయడంతో ఆ పదవికి అధికార లేబర్ పార్టీ నుంచి ఎంపీ హిప్కిన్స్ ఒక్కరే నామినేషన్ వేశారు. జనవరి 22న ప్రతినిధుల సభ సమావేశంలో ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించింది. 2008లో తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికైన ఆయన 2020లో కోవిడ్–19 మంత్రిగా నియమితులయ్యారు. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్‌లో ఎన్నికలున్నాయి. లేబర్ పార్టీకి గెలుపు కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు.
Jacinda Ardern: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా రాజీనామా
Published date : 23 Jan 2023 10:31AM